Facebook Twitter
జీవితం.. ఓ ప్రయాణం

జీవితం.. ఓ ప్రయాణం

 

 


జనన మరణాల మధ్య సాగే ప్రయాణమే జీవితం.
ఆ ప్రయాణంలో మీరు కోరుకునేది 
ఆస్తులా? ఆప్తులా?
ఆనందమా? విచారమా?
ప్రేమా? ప్రతీకారమా ?
నవ్వులా? ఏడుపులా?
పలకరింపులా? చివాట్లా?
అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి.
ఎందుకంటే మీ జీవిత ప్రయాణానికి మీరే రథ సారథి.
మీ ప్రయాణం ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి.
కానీ ఒక్కటి మాత్రం నిజం
మీ ప్రయాణంలో మీరేం సాధించినా చివరికి చేరాల్సిన గమ్యం మరణం.
'మరణం మిమ్మల్ని గెలిచేలోపు ఆప్తుల్ని గెలుచుకోండి.. ఆనందాన్ని పంచుకోండి..
సాటి మనుషులను ప్రేమగా పలకరిస్తూ నవ్వులు పంచండి'.
అప్పుడే కదా
'బ్రతికుండగా మనిషి అనిపించుకుంటారు
మరణించాక కూడా బ్రతికుంటారు'.

 
- గంగసాని