Facebook Twitter
మానవ వికాసం

మానవ వికాసం

 

మనిషి ప్రయత్నమే కదా
ఈనాటి అభివృద్ధి!
జంతు దశ నుండి నిరంతరం
దినదినవికాసంతోనే 
అడుగడుగునా అవరోధాలెన్నెదురైనా
తట్టుకుంటూ నెట్టుకుంటూ
కటికచీకటిని సైతం పారద్రోలే
నిప్పును కనిపెట్టి వెలుగులోకి అడుగెట్టడమే కాదు
ఛక్రాన్ని కనిపెట్టి 
జగతి గతిని ప్రగతిని మరోస్థాయిలోకి 
విశ్వమ్మొ త్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ప్రతి అడుగులో మానవప్రయత్నాన్ని కాదనలేం కదా!!
వికాసంతోపాటు 
మంచితో పాటు చెడుకూడా
తనవెంటే కదిలి
తన వినాశనానికి 
రూపం దాల్చింది
అభివృద్ధి పేరుతో 
పచ్చని ప్రకృతిని 
నాశనంచేసి 
మనిషికి మనుగడ 
లేకుండా చేస్తున్నడు!!
అంతరిక్షంలో అడుగెట్టినా
అద్దాలమేడల్లో ఆకాశహార్మ్యాల్లో నివాసమున్నా..
సాటిమనిషిని ఆదరించని నేటి నాటు మనిషికి
మానవత్వం వికాసం చెందితేనే మానవప్రయత్నంతో సాధించిన అభివృద్ధికి సార్థకత!!!

 

సి. శేఖర్(సియస్సార్)