Facebook Twitter
మండే ఎండలు

మండే ఎండలు

ఎండులు చూస్తుంటే
గుండెలదురుతున్నయ్
కళ్ళుకూడ చూడలేనంత
కాయం తట్టుకోలేనంత
కాలు బయటపెట్టలేనంత
నిప్పులు కక్కుతూ సూర్యుడు
నిలువెల్ల దహిస్తున్నడు
నీళ్ళెన్ని తాగిన క్షణంలో ఆవిరైపోతున్నయ్
ఎండకెళ్ళె ధైర్యం లేక 
ఎవరు బయటకురాలేరు
ఎక్కడివాల్లక్కడే 
వడగాలులైతే వడివడిగా వీస్తున్నయ్
వడదెబ్బకు బలైపోయే బతుకులెన్నో?
మనిషి బతుకిలావుంటే
మూగజీవాల పరిస్థితేంటి?
విచక్షణ మరచిన మనిషి
ప్రకృతిని తనిష్టానికి అనుగుణంగా
నాశనం చేస్తూనేవున్నడు
చెట్టు మొత్తం నరికేసి
కర్మాగారాల నిర్మాణాలతో
కాలుష్యాన్ని బహుమానమిస్తున్నడు
సాంకేతికంగా అభివృద్ది చెంది
అంతరిక్షం చేరినా
నివాసానికనువైన భూమిపై
తన ఆగడాలకు అడ్డుకట్టలులేవు
కల్తీ రాజ్యానికి అధిపతౌతున్నడు
ఓజోన్ పొర తరిగిపోయే తరువయ్యింది
ఎండలకు మనుషులే పిట్టల్లా రాలిపోతుంటే 
పక్షులు జంతువుల మాడిమసైపోతున్నయ్
నెర్రెలిచ్చే నేలలో నీటిశాతం అడుగంటి ఆగమవుతున్న స్థితి
జలంలేని జగతి గతితప్పి 
జనం అల్లాడిపోక తప్పదు
పచ్చదనంలేని పుడమి
స్వచ్ఛమైన సంతోషంలేని అనాథౌతుంది
తస్మాత్ జాగ్రత్త!!!!

 

 

సి. శేఖర్(సియస్సార్)