Facebook Twitter
ఉదయపు కల...

ఇవాల ఉదయం కల కన్నా...
పాతదే...
ఐనా కొత్తగా ఉంది..
ఈ రోజులా మునుపెన్నడూ లేదు
నిన్న నన్ను ధ్వంసం చేసిన ఆ క్రియాశీలకాలు
ఆ కలలో దగ్ధం అయినట్టుగా ఉంది
అందుకనేమో ఈ రోజు నిన్నటి విధ్వంసంలా లేదు..
మలిదశకు చేరుకున్న కర్మలను
తొలిశతాబ్ధపు ఆనావాళ్ళుగా చెప్పుకునే కర్తలను
బహుముఖ ప్రజ్ఞాశాలులుగా వర్ణించాలో ఏమో
ఇప్పుడు...
ఉదయం బోరున ఏడుస్తుందేమో
మొట్టమొదట నుండి చిట్ట చివర వరకూ కల కంటే
నా పిచ్చి కలలతో ఈ ఉదయం ఎందుకు
కనుమరుగైందో ఏమో..
మళ్ళీ అదే రణరంగం..
అదే ప్రస్తుతం...
కళ్ళు తెరిచి చూస్తే
అదే పాత ప్రపంచం...
కనీసం కలలోనైనా కొత్త
ప్రపంచం కల కనాలి
తర్వాత ఎప్పుడైనా...

 

- Malleshailu