Facebook Twitter
అంతం ఆంరంభానికి నాంది

ఉగాది కవిత
అంతం ఆంరంభానికి నాంది

 

పట్టువదలని కలం 
తెలుగింట తిష్టవేసిన
గడువుతీరిన ఏడాదిని 
భుజాన వేసుకొని మోనంగా నడకసాగించింది
నిర్జీవమైన సంవత్సరం ప్రశ్నించింది
ఓ కాలమా! ఎందుకు నీకీ ప్రయాస 
నువ్వెంత నన్ను మోసుకేళ్ళినా 
అరవై ఏళ్ళకు తిరిగి వచ్చేదాన్నే
మళ్ళీ తెలుగు లోగిత సందడి చేసేదాన్నే
కలం మోనంవీడి హెచ్చరిస్తూ
ఓ సంవత్సరమా! పేరు మార్చుకొని 
నా వెంట తిరుగుతుంటే సరిపోదు
పేరులోనే పెన్నిధి ఉన్నట్లు 
జనత మురిసిపోతున్నది 
ఆకులను రాల్చుకున్న కొమ్మలు 
కొత్త చిగుళ్ళను ఆహ్వానిస్తున్నాయి
రేమ్మలన్ని కొత్తపూలనెత్తావిని 
ఆష్రూణించటానికి ఆరాటపడుతున్నాయి
కలాండజములు పల్లవములనారగించి
గానామృతాన్నందించటానికి ఉవ్విళ్ళూరుతున్నాయి
కవులు అక్షరమొదళ్ళను తొలచి 
మొదళ్ళను కొత్త కవితలల్లటానికి
సమాయత్త పరుస్తున్నారు పేరులోనేకాదు నాణ్యతలోనూ
కొత్తదనముందని నీవూ చాటిచేప్పుకోవాలి
వివేకవంతులెవారూ పాతనే అంటిపెట్టుకొనుండాలని
అనుకోరన్నది తరతరాల సత్యం
'అంతం ఆరంభానికి నాంది' అన్నట్లు 
నూతనత్వాన్ని నింపుకున్న మరో సంవత్సరానికి 
జనం స్వాగతం పలుకుతారంటూ
కలం మోనంవహించింది

రచన : పొత్తూరి సుబ్బారావు