Read more!

Stuffing Bread Rolls Recipe

 

 

 

స్టఫ్ఫింగ్  బ్రెడ్ రోల్స్

 

 

 

కావలసినవి:
ఆలూ  - రెండు 
బ్రెడ్ స్లయిస్‌లు - ఐదు 
బఠానీలు - చిన్న కప్పు 
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - ఒకటి
పచ్చిమిర్చి - మూడు 
పసుపు  - చిటికెడు
వెన్న- చిన్న కప్పు 
కొత్తిమీర - కొద్దిగా 

 

తయారుచేసే విధానం:
ముందుగా  ఆలూని, బఠానీలని విడివిడిగా  ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని  గిన్నె పెట్టుకుని  అందులో కొంచెం వెన్న వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి. తరువాత ఉడికించి, మెత్తగా చేసిన ఆలూ గుజ్జు, ఉడికించిన బఠానీలు కూడా కలిపి, కొంచెం పసుపు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి  కర్రీ చేసుకోవాలి . ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ చివర్లు  కట్ చేసి  వాటి పైన తయారు చేసిన ఆలూ కర్రీని పెట్టి  బ్రెడ్ స్లయిస్ కార్నర్ నుండి రోల్ లాగా  చుట్టుకోవాలి ఇలా  అన్నిటిని రెడీ చేసిపెట్టుకోవాలి . ఇప్పుడు స్టవ్ వెలిగించి  పాన్ పెట్టి వెన్న వేసి, బ్రెడ్ రోల్స్ ఒక్కొక్కటి  వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని  తరువాత  వాటిని రౌండ్‌గా కట్ చేసుకోవాలి.