వైవీ సుబ్బారెడ్డి వ‌ర్రీ.. ప‌క్క‌న పెట్టేశారా? ప‌ట్టు సాధిస్తారా?

Publish Date:Jul 1, 2021

Advertisement

ఎంపీ టిక్కెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. కోపం వచ్చింది. కనీసం జిల్లాలో తాను చెప్పినవారికి ఇవ్వమన్నా.. వినలేదు. ఈసారి బాగా హర్టయ్యారు. సైలెంట్ అయిపోయారు. అధికారం వచ్చాక..కీలక పదవి అప్పచెప్పారు. అలక తీరిపోయింది. బాగుంది బాగుంది అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు తాను ఒక కోటలో బంధించబడ్డానని.. తన కొలీగ్స్ మాత్రం రాష్ట్రాన్ని ఏలేస్తున్నారని..అర్ధమైంది. అందుకే బాధపడుతున్నారు. ఆ కీలక పదవి ఇక అక్కర్లేదని తెగేసి చెప్పేశారంట. అధినేత ఏమనుకున్నా సరే..ఐ డోంట్ కేర్ అంటున్నారంట. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిందేనని డిసైడ్ అయ్యారంట.


వైవీ సుబ్బారెడ్డి. వైసీపీలో కీలక నేత.. పార్టీ పంచతంత్రంలో ఒక ముఖ్యమైన తంత్రం. అలాంటిది తనకు వాల్యూ లేకుండా పోయిందని.. కీలకమైనవన్నీ ఇతరులు చేసుకుంటుంటే..తాను మాత్రం తిరుపతికే పరిమితమైపోయానని బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే ఈసారి టీటీడీ ఛైర్మన్ పదవి తనకు వద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్ ప్రతి ఏడాది నియమిస్తారు. కొనసాగించాలనుకుంటే కొనసాగిస్తున్నట్లు చెబుతారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం ముందు వైవీ సుబ్బారెడ్డి ఈ మాట చెప్పారట. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి అవసరం లేదని చెప్పేశారంట. బాస్ ఇలా అలగడం మొదటిసారి కాదు.

2014 ఎన్నికలప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య ప్రకాశంలో ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. అప్పుడు బాలినేనితో సహా కొందరి ఓటమికి వైవీ సుబ్బారెడ్డే కారణమని పార్టీలో చర్చ జరిగింది. అప్పటి నుంచి జగన్ వైవీపై గుర్రుగా ఉన్నారని చెబుతుంటారు. అందుకే 2019 ఎన్నికలప్పుడు ఎంపీ టిక్కెట్ రెండో సారి ఇవ్వకుండా.. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా వైవీ మాటకు విలువ ఇవ్వలేదు. దీంతో హర్టయిన వైవీ సుబ్బారెడ్డి సైలెంట్ అయిపోయారు.

అధికారం వచ్చాక.. వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి అప్పచెప్పారు. దీంతో వైవీ శాంతించారు. చాలా కమిటెడ్ గా..జగన్ డైరెక్షన్ ప్రకారం టీటీడీ వ్యవహారాలు నడిపిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి. వారనుకున్నట్లే.. టీటీడీలో ఆసాంతం వారి కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న టైములో వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొత్త ఆలోచనలు కలిగించాయని తెలుస్తోంది.

సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూ గా ఎదిగిపోవటం.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతా ఆయనదే నడుస్తుండటం వైవీ సుబ్బారెడ్డికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది. అలాగే విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గినట్టు కనపడ్డా..ఉత్తరాంధ్రను సామంతరాజ్యంలా నడిపిస్తూ..ఢిల్లీలో తన పట్టు కొనసాగించుకోవడంతో..ఆయనకు ఏ ఢోకా లేకుండా ఉంది. ఎటొచ్చీ వారిద్దరి కంటే జగన్ కు క్లోజ్ అయినప్పటికీ...తాను మాత్రం దూరమైపోయానా అనే బాధ ఆయన గుండెలను మెలిపెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. తన మనిషి సీఎంగా ఉంటే..తాను మాత్రం ఏడుకొండల మధ్య బందీ అయిపోయానని.. ఇలా కాదని.. తాను కూడా రాష్ట్రమంతా పట్టు సంపాదించాలని పట్టుదల మీదున్నట్లు తెలుస్తోంది. అందుకే  ఈసారి తనకు టీటీడీ ఛైర్మన్ పదవి అవసరం లేదని తెగేసి చెప్పేశారంట. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. దానికి వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.