ఈ సారైనా జ‌గ‌న్...వ్య‌క్తిగ‌తంగా హాజ‌ర‌వుతారా?

Publish Date:Nov 12, 2025

Advertisement

 

చ‌ట్టాల ఉల్లంఘ‌న జ‌గ‌న్‌కి కొట్టిన పిండి. వెన్న‌తో పెట్టిన విద్య‌. వార‌స‌త్వంగా  వ‌చ్చిన ఆస్తిపాస్తుల్లో ఇదొక‌టా? అంటే అవున‌నే చెప్పాలంటారు చాలా మంది. ఆయ‌న పుష్క‌ర  కాలంగా అంటే, ప‌న్నెండేళ్ల నాటి నుంచి బెయిలుపై బ‌య‌ట తిరుగుత‌న్న సంగ‌తి అటుంచితే క‌నీసం కోర్టుకు వ్య‌క్తిగ‌త హాజ‌రు కావ‌డం లేదు. అదేమ‌ని అడిగితే తాను వ‌స్తే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య భారీ ఎత్తున  ఏర్ప‌డుతుంద‌ని.. అందుకే తాను అలా హాజ‌రు కావ‌డం లేద‌ని నెట్టుకొస్తున్నారు జ‌గ‌న్.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌లా  వేసిన  వాయిదాల మీద వాయిదాల‌ను లెక్కిస్తే అవే కొన్ని వేల సార్ల‌ వ‌ర‌కూ ఉంటాయి. ఇక ఆయా వాయిదాలకుగానూ ఆయ‌న పెట్టిన  లాయ‌ర్ ఖ‌ర్చులే కోట్లాది రూపాయ‌ల్లో ఉంటాయని అంచ‌నా వేస్తారు న్యాయ‌నిపుణులు. ఇటీవ‌ల జ‌గ‌న్ లండ‌న్ వెళ్తూ వెళ్తూ ఒక ఫాల్తు నెంబ‌ర్ కోర్టుకు స‌బ్మిట్ చేశార‌న్న అభియోగం ఒక‌టి కొత్త‌గా వెలుగులోకి వ‌చ్చింది. జ‌గ‌న్ ఏదైనా అంతే. నేరుగా చేయ‌రు. ఇటీవ‌ల  హోం మంత్రి అనిత అన్న‌ట్టు.. ఏపీ కార్య‌ర్త‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోడానికి డిజిట‌ల్ బుక్ కోసం ఒక నెంబ‌ర్ ఇస్తే.. అది కాస్తా తెలంగాణ‌ది. ఆయ‌నుండేదేమో క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు.

ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే, జ‌గ‌న్ ఈ డొంక తిరుగుడు వ్య‌వ‌హార‌శైలికి విసిగి వేసారిన కోర్టు ఆయ‌న్ను వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి ఇక మిన‌హాయించ‌లేమ‌ని.. ఈ నెల  21 త‌ప్ప‌నిస‌రిగా  జ‌గ‌న్ హాజ‌రు కావ‌ల్సిందేన‌ని ఆదేశించింది. మ‌రి  త‌న వాయిదాల తెలివితేట‌ల‌తో జ‌గ‌న్ దీన్నెలా అధిగ‌మిస్తారో తేలాల్సి ఉంది.ఇదిలా  ఉంటే జ‌గన్ వ్య‌క్తిగ‌త హాజ‌రే జ‌ర‌గ‌డం లేదంటే.. ఇక ఆయ‌న్ను జైలుకు పంప‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా? ఎంతైనా జ‌గ‌న్ జ‌గ‌నే. ఇలాంటి విష‌యాల్లో ఆయ‌న‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ మాఫియా డాన్ల‌కు లేనంత తెలివితేట‌లున్నాయ‌ని మాట్లాడుకుంటున్నారు ఆంధ్రా ప‌బ్లిక్.


జగన్ యూరప్‌ టూర్ అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని గట్టిగా కోరింది. తీవ్ర ఆర్థిక నేరారోపణలను ఎదుర్కొంటున్న జగన్‌.. ఆరేళ్లుగా ట్రయల్‌ కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపింది. ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్‌ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. దీంతో గత్యంతరం లేక వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్‌ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు
 

By
en-us Political News

  
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.