పరారిలో ఉన్న యూట్యూబర్ హర్షసాయి అకస్మాత్తుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. కూల్ డింక్ లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసినట్లు ఓ సెలబ్రిటీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సెలబ్రిటీ సెప్టెంబర్ నెల 24 వ తేదీన హర్షసాయిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. రూ.2 కోట్ల రూపాయలు సైతం తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు హర్షసాయిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత హర్ష
సాయి పరారీలో ఉన్నాడు. అరెస్ట్ తప్పించుకోవడానికే హర్షసాయి విదేశాలకు పారిపోయినట్టు ప్రచారం జరిగింది. హర్షసాయి కోసం పోలీసులు గాలించారు. ఏ క్షణమైనా అరెస్ట్ అవుతాడన్న ప్రచారం జరుగుతుండగా తెలంగాణ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరయిన తర్వాత హర్ష సాయి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక్షమయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్న హర్షసాయి నిజాలు బయటకొచ్చాయి కాబట్టే కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందన్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/youtuber-harshasai-was-spotted-at-the-airport-25-187854.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.