దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం! యువరక్తమే పరిష్కార మార్గం?
Publish Date:Jun 17, 2012
Advertisement
సరిగ్గా 31ఏళ్ళ క్రితం ... ఓ తెలుగుతేజం రాజకీయ సంచలనానికి నాందీప్రస్తావన పలికింది. అదీ వెండితెర వెలుగుగా కీర్తిపతాకాన్ని పొందినా ప్రజాసేవకోసం రాజకీయ తెరంగ్రేటం చేసింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ప్రపంచవ్యాప్త మన్ననలు అందుకున్న నందమూరి తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి 1982లో తెలుగుదేశంపార్టీని నెలకొల్పారు. ఆయన ఎంత సంచలనంగా నిర్ణయం తీసుకుని పార్టీ స్థాపించారో అంతే సంచలన మైన స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించి గద్దెనెక్కారు. ముందునుంచి నటనతో పాటు ప్రజాజీవితానికి దగ్గరగా పనిచేసిన అనుభవాన్నీ రంగరించి పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఒంటిచేత్తో శాసించారు. ఆనాటి రామారావు ఒక సంచలనానికి వేదిక. ఆయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ యావత్తు గెలిపించుకున్న ధృవతారగా కీర్తినందు కున్నారు. గద్దెనెక్కిన తొలినాళ్ళలోనే ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని పొందిన నాదెండ్ల భాస్కరరావును ప్రజాతీర్పుతో తిప్పికొట్టారు. కానీ, చివరకి తన సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో పరాభవానికి గురై తీవ్రవేదనతో కన్నుమూశారు. ఈ 31ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆ పార్టీ మాత్రం చిరస్థాయిగానే నిలిచిపోయింది. అయితే ఎన్టీఆర్ లా ఒంటిచేత్తో గెలిపించుకునే సత్తా ఉన్న నాయకుని కొరతతోనే సతమతమవుతోంది. 14ఏళ్ళ అధికారం, 17ఏళ్ళ ప్రతిపక్షహోదాతో ఇప్పుడు తామేస్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు పొలిట్ బ్యూరో సభ్యుల ముందు పార్టీ నిలిచింది. నాటి చరిష్మాగానీ, ఆకట్టుకునే పథకాలు కానీ ఇప్పుడు ఆ పార్టీకి లేవు. అందుకే 2012 ఉపఎన్నికల్లో ఎంతో జూనియర్ అనుకున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి దెబ్బకు కంగుతింది. 18 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన ఈ ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటీ సాధించాలేకపోవటానికి సరైన కారణం వెదికేందుకు కసరత్తులు చేస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ బొమ్మనే పూర్తిగా చెరిపేసింది. అంతేకాకుండా ఆయన కుటుంబానికీ ఈ పార్టీ దూరమైంది. ఎన్టీఆర్ ఏ పార్టీనైతే విమర్శించారో ఆ పార్టీలోనే అంటే కాంగ్రెస్ లో దగ్గుబాటి పురందరేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఈమె ఎన్టీఆర్ కుమార్తె. ఆయన భార్య లక్ష్మీపార్వతి ఇప్పుడు జగన్ పంచన చేరింది. ఆమె ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. అలానే ఎన్టీఆర్ రూపురేఖలలో తీసిపోని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్, కుమారుడు హరికృష్ణ మరో కుమారుడు బాలకృష్ణ ఎవరూ కూడా పార్టీ తరపున ప్రచార బాధ్యతలు తీసుకోలేదు. బాబు రమ్మంటేనే ప్రచారానికి వస్తామని అంటున్నారు. ఇటీవల ఉపఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడులుకోవటమే కాకుండా కేవలం జగన్ పై దూషణలకె చంద్రబాబు పరిమితమయ్యారు. తమకున్న అజెండాను బయటపెట్టలేకపోయారు. ప్రత్యేకమైన హీమీలు ఇవ్వలేకపోయారు. స్థానికంగా ఉన్న సమస్యలు బయటపెట్టలేకపోయారు. స్థానికంగా ఉండే సీనియర్లకు పెద్దపీట వేసే ధోరణిని మరచిపోయారు. స్థానికంగా ఉండే స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు వంటివాటిని ఆకర్షించేందుకు కసరత్తులు చేయలేకపోయారు. తమకు మహిళలంటే ఉన్న గౌరవాన్ని చాతుకునేలా గతంలో ప్రసంగించిన చంద్రబాబు రాజకీయంగా ఎదిగి ఆ మహిళల గురించి మాట్లాడటమే మానేశారేమిటన్న ప్రశ్న చంద్రబాబు పర్యటించిన ప్రతీప్రాంతంలోనూ వినిపించింది. ఇంకో విచిత్రమేమంటే రోడ్డుషో పేరిట చేసే ప్రసంగాల్లో సమగ్రతను కోల్పోయిన చంద్రబాబునే ఓటర్లు చూశారు. అప్పట్లో మాదిరిగా సమస్యలపై కూలంకుషంగా మాట్లాడే నేర్పున్న బాబును ఈసారి ఓటర్లు గమనించలేదు. అలానే ఎవరైనా పార్టీ మారితే సస్పెన్షన్, క్రమశిక్షణ తప్పదని హెచ్చరించే బాబు ఈ మధ్యనే బుజ్జగించటం మొదలుపెట్టారు. తనకు వయస్సు పెరుగుతోంది కాబట్టి బాబు సీరియస్ గా క్రమశిక్షణ వదిలేశారు. గతంలో ఈ క్రమశిక్షణకె జడిసి అభ్యర్థులూ, ప్రజలూ, ఉద్యోగులూ ఆయనకు సహకరించారు. అధికారం కోల్పోయాక ఆ గత అనుభవాన్ని మరిచిపోయిన చంద్రబాబు తన పార్టీ యువరక్తంతో నింపేందుకు ప్రయత్నిస్తేనే బాగుంటుంది. అలా అని తన కుమారుడు లోకేష్ ఒక్కరితోనే రాజకీయరంగ ప్రవేశం చేయించకుండా ఇంకా యువరక్తంతో పార్టీని నింపేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది. ఆసక్తి ఉన్న యువకులను చంద్రబాబు ముందుగా ఆహ్వానిస్తే రాజకీయాల్లో వారు రాణిస్తే ఆయన కూడా అధికారం పొందేందుకు అవకాశాలు ఉంటాయి కదా! మరి బాబేమిటో ఈ దిశగా ఆలోచించటం లేదంటున్నారు. ఉపఎన్నికల్లో దేశం ఓటమికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. ఏమైనా చరిష్మా ఉన్నవారికి దేశం స్వాగతం పలికితే బాగుంటుందని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/young-blood-in-tdp-24-14942.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





