ప్ర‌పంచ ఆరోగ్యానికి భార‌త్ కానుక‌.. యోగా!

Publish Date:Jun 20, 2022

Advertisement

ఇటీవ‌లి కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలామంది ఉద‌యాన్నే ఇంట్లోనో,  పార్కుల్లోనో,  ఒంటరిగానో, ఒక గ్రూప్‌గానో ధ్యానం, యోగా చేస్తుండ‌డం గ‌మ‌నిస్తున్నాం. సెల‌వురోజుల్లో అయితే ఇది మ‌రీ ఖ‌చ్చితంగా ఒక స‌మ‌యం అంటూ పాటిస్తున్నారు. వృత్తి, ప‌ని, సామాజిక‌, ఆర్ధిక ప‌రిస్థితుల్లో వ‌స్తున్న మార్పులు, వొత్తిడుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు యోగా ఎంతో అవ‌స‌ర‌మ‌ని యోగా టీచ‌ర్లు, టీవీల్లో ప్ర‌చా ర‌కులు ప్ర‌జ‌ల‌కు బోధిస్తూనే వున్నారు. యోగాను ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డానికి ద‌గ్గ‌ర మార్గంగా చూస్తున్న వారే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నారు. ఇదేదో కొత్త‌గా లోకంలోకి వ‌చ్చినది కాదు. విదేశాల నుంచి దిగుమ‌తి అయింది అంత‌కంటే కాదు. సుమారు మూడు వేల ఏళ్ల కింద‌నే ప్రాచీన భార‌త‌దేశంలో ఆరంభ‌మ‌యింది. పూర్వం రుషులు వారి శారీర‌క‌, మాన‌సిక‌, ఆధ్యాత్మిక శ‌క్తిసామ‌ర్ధ్యాలు పెంపొందించుకోవ‌డంలో దీన్ని గొప్ప మార్గంగా క‌నుగొని అనుస‌రించారు. అదే త‌ర‌త‌రాలుగా అందుతున్న  అద్భుతం.  ఈ కాలానికి  గొప్ప ఆరోగ్య సూ త్రంగా మారింద‌నీ అంటున్నారు. రోజూవారీ జీవితంలో దీనివల్ల గొప్ప ప్ర‌యోజ‌నం వుంద‌ని యోగా చేస్తు న్న వారి మాట‌. దీనివ‌ల్ల ఎవ‌రిక‌యినా స‌రే మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఆత్మ‌స్థైర్యం పెరుగుతుం ద‌ని అనుభ‌వ జ్ఞుల మాట‌. యోగావ‌ల్ల జీవితంలో ఆనందాన్ని మ‌రింత చ‌విచూడ‌గ‌ల‌మ‌నీ అంటున్నారు.  చాలాకాలం నుంచి డ‌యాబిటీస్‌, మాన‌సిక వొత్తిడి సంబంధిత జ‌బ్బుల‌కు లోన‌యి డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగి విసిగెత్తిన‌వారు యోగా ద్వారా ఆ బాధ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డిన ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లు. చూడ్డానికి ఏదో వ్యాయామంలా క‌నిపించే యోగా నిజానికి మ‌నిషి శారీర‌క‌, మాన‌సిక దృఢ‌త్వానికి వుప‌యోగ ప‌డుతుంది. దీన్ని ఎవ‌ర‌యినా, వ‌య‌సుతో నిమిత్తిం లేకుండా చేయ‌వ‌చ్చ‌ని యోగా గురువుల మాట‌.

వేలాది సంవ‌త్స‌రాలుగా భార‌త్‌కే యోగా ప‌రిమిత మ‌యింద‌న్న వాద‌న వుంది. ఈ ఆధునిక కాలంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీని ప‌ట్ల ఆద‌ర‌ణ పెరిగి దాదాపు అన్ని దేశాల్లోనూ అనుస‌రిస్తున్నారు. ప్ర‌త్యేక కార్య క్ర‌మాలు నిర్వ‌హించ‌డం, ప్ర‌త్యేకించి యోగా గురువుల‌ను భార‌త్ నుంచి పిలిపించుకుని మ‌రీ నేర్చు కోవ డం కూడా గ‌త పాతికేళ్లుగా సాగుతోంది. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ప్ర‌జ‌లు విధిగా రోజూవారీ  కార్యక్ర‌మం గా యోగాను చేస్తుండ‌డం ఎంతో అభినంద‌నీయం. 2014 సెప్టెంబ‌ర్‌లో ఐక్య‌రాజ్య స‌మితికి భార‌త ప్రధాని న‌రేంద్ర‌మోడీ  యోగా డే ను ప్ర‌క‌టించ‌మ‌ని  ప్ర‌తిపాదించారు. ఈ ప్ర‌తిపాద‌న గురించి ఐక్య‌రాజ్య స‌మితి 177 స‌భ్య‌దేశాల చ‌ర్చ‌ల అనంత‌రం భార‌త్ ప్ర‌తిపాద‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించింది. ఫ‌లితంగా  జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా యు.ఎన్ ప్ర‌క‌టించింది.  2015 లో మొద‌టి అంత‌ర్జాతీయ యోగా డే  పాటిం చారు. 

కోవిడ్‌-19 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జారోగ్యం ప‌ట్ల ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించేలా చేసింది. అన్ని దేశాల్లోనూ అందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. ప్ర‌జ‌లు ఆరోగ్య ర‌క్ష‌ణ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ధ చూపాల‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేశాయి. ఈ స‌మ‌యంలోనే అత్యంత చౌక‌గా అందుబాటు లోకి వ‌చ్చిన గొప్ప ఆరోగ్య సూత్రం యోగా. యావ‌త్ ప్ర‌పంచంలోనూ యోగాను అనుస‌రించ‌డం ద్వారా కోవిడ్ అనంత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకున్నట్టు స‌మాచారం.

ముఖ్యంగా ప్ర‌జ‌లు మాన‌సిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ‌డానికి, ఆత్మ‌స్థైర్యంతో జీవితంలో ముంద‌డుగు వేయ‌డానికి యోగా ఎంతో స‌హ‌క‌రించింద‌న్నది వింటూనే వున్నాం. కోవిడ్-19 విజృంభించిన స‌మ‌యంలో డాక్ట‌ర్లు, ఆరోగ్య సేవ‌కులు వూహించ‌నంత శ్ర‌మ‌కు లోన‌యినా ప్ర‌జారోగ్య ర‌క్ష‌ణ విష‌యంలో విజ‌యం సాధించ‌డానికి కంక‌ణం క‌ట్టు కున్న యోధుల్లా ప‌నిచేశారు. అంతేస్థాయిలో యోగా ఆ త‌దుప‌రి జీవ‌నాన్ని స‌మ‌స్య‌ల ర‌హితంగా చేయ‌డా నికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచింది. 

మానవ బాధలతో పాటు, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా  ఉన్న దేశాల ఆర్థిక, అభివృ ద్ధి నమూనాల   అనేక కీలక దుర్బలత్వాలను కూడా  హైలైట్ చేసిం ది. కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకున్నప్పుడు సభ్య దేశాలు విభిన్నంగా పునర్నిర్మించాలని భవిష్య త్తు శ్రేయస్సు  కోరుతోంది. భూమి గ్రహానికి  అనుగుణంగా స్థిరమైన జీవనశైలిని  ప్రోత్సహించడానికి మానవాళి యొక్క సామూహిక అన్వేషణలో యోగా ఒక ముఖ్యమైన సాధనం. ఈ స్ఫూర్తికి  అనుగుణంగా, ఈ సంవత్సరం యోగా డే  వేడు కల థీమ్  మానవత్వం కోసం యోగా.

By
en-us Political News

  
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.