జగన్ జెండా పీకేయడం ఖాయం.. బాలినేని ఉవాచ!

Publish Date:Sep 16, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండా పీకేయడానికి రెడీ అయిపోయారా?  వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇక లాంఛనమేనా? అన్న అనుమానాలు గత కొంత కాలంగా రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయిపోయిన జగన్ ఆ లాంఛనం పూర్తి చేయడానికి శతథా ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయన సోదరి షర్మిల అడ్డుపడుతున్నారనీ వైసీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఆ కారణంతోనే జగన్ అడపదడపా ఆందోళనలకు, తన హయాంలో అడ్డగోలుగా అక్రమాలకు, దాడులకు, దౌర్జన్యాలకూ పాల్పడి ఇప్పుడు అరెస్టయిన వారిని పరామర్శించేందుకు తప్ప తాడేపల్లి ముఖమే చూడటం లేదని అంటున్నారు. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై అక్కడ నుంచి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివప్రసాద్ ద్వారా కాంగ్రెస్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారనీ అంటున్నారు. అయితే నిన్నటి వరకూ ఇవి కేవలం ఊహాగాన సభలు మాత్రమే. అయితే ఇప్పుడు జగన్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయిపోయారని, ఇవ్వాళ కాకుంటే రేపు ఆ లాంఛనం పూర్తికావడం ఖాయమనీ తేలిపోయింది. జగన్ విలీన ప్రయత్నాల గురించి ఆ పార్టీ సీనియర్ నేత, స్వయంగా జగన్ కు సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డే కుండబద్దలు కొట్టేశారు.

ఏదో లోపాయికారీ సంభాషణల్లోనే, వ్యక్తిగత బాతాఖానీలోనో ఆయనీ మాటలు చెప్పలేదు. పార్టీలోని తన వర్గం వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనీ మాటలు చెప్పారు. అసలు ఇప్పటికే విలీన ప్రక్రియ పూర్తై ఉండేదనీ, కానీ జగన్ సోదరి షర్మిల గట్టిగా అడ్డుపడటంతో అది వాయిదా పడిందని బాలినేని చెప్పారు. ఇప్పుడు కాకపోతే రేపు, ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది.. వైసీపీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడానికి కూడా డీకే శివకుమార్ మధ్యవర్తిత్వమే కారణం. ఇప్పుడు జగన్ కూడా సోదరి బాటనే అనుసరిస్తూ.. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆయననే ఆశ్రయించారు. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చినా, షర్మిల అభ్యంతరం కారణంగా విలీన ప్రక్రియకు బ్రేక్ పడిందని బాలినేని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం,  అటు కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పాత్రపోషిస్తుండటంతో బలమైన జాతీయ పార్టీ అండ లేకుండా మనుగడ కష్టమన్న భావనకు జగన్  రావడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.  తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో జాతీయ పార్టీ సాయం లేనిదే  బతికి బట్టకట్టటం కష్టమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ మనుగడ పూర్తిగా భాగస్వామ్య పక్షాలు అందునా తెలుుగదేశంపై ఆధారపడి ఉంది. సొంతంగా పూర్తి బలం లేని బీజేపీ ప్రభుత్వ మనుగడ విషయంలో తెలుగుదేశం, జేడీయూలపైనే ఆధారపడి ఉంది.

బీజేపీ అయితే జేడీయూ కన్నా తెలుగుదేశం పార్టీనే విశ్వసనీయ ప్రతిపక్షంగా భావిస్తోంది. చంద్రబాబు విజన్, విశ్వసనీయత కారణంగా అకారణంగా, రాజకీయ లబ్ధి కోసం ఆయన కూటమి నుంచి వైదొలిగే అవకాశాలు లేవనీ, ఆయన కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు  కేంద్రంలోని కూటమి ప్రభుత్వం భంగం వాటిల్లేలా వ్యవహరించనంత వరకూ చంద్రబాబు కూటమికి మద్దతుగానే ఉంటారన్నది బీజేపీ నమ్మకం. ఆ కారణంగానే జగన్ కు కేసుల నుంచి రక్షణ విషయంలో బీజేపీ ఏ మాత్రం సహకారం అందించే అవకాశాలు లేవు.

అదే సమయంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ పంచన చేరితే.. తనపై కేసుల విచారణ వేగవంతం కాకుండా కేంద్రంపై పొలిటికల్ ప్రెషర్ తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్దేశంతోనే జగన్ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తహతహలాడుతున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలన్నీ నూటికి నూరు పాళ్లూ వాస్తవమే అనడానికి తాజాగా బాలినేని తన అనుచరులు, అనుకూల కార్పొరేటర్లతో జరిపిన సమావేశంలో వైసీపీ కాంగ్రెస్ విలీనం నిజమేనని చెప్పడమే తార్కాణం. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.