పాదయాత్రను అడ్డుకునేందుకు ధ్వంసరచనకు వైసీపీ వ్యూహం?

Publish Date:Oct 21, 2022

Advertisement

అమరావతే  రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాయాత్రకు ప్రమాదం పొంచి ఉందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. మహా పాదయాత్ర మరి కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సీఎం  జగన్, మూడు రాజధానులంటూ ప్రకటించేశారు. దీంతో విశాఖపట్నం మరి కొద్ది రోజుల్లో కార్యనిర్వాహక రాజధానిగా మారనుందని.. ఇక్కడి నుంచి సీఎం జగన్ పాలన చేయనున్నారంటూ.. ఆ పార్టీలోని కీలక నేతలు వరుస ప్రకటనలు చేసేస్తున్నారు.  

ఈ నేపథ్యంలో రైతుల పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన వెంటనే.. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. విశాఖలో కార్యనిర్వహాక రాజధాని ఏర్పాటు చేయాలంటూ అధికార పార్టీ చేపట్టిన విశాఖ గర్జన కు ప్రజల నుంచి స్పందన కరవవ్వడం అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రైతుల మహాపాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టడం, మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు పట్టించుకోకపోవడాన్ని గమనిస్తున్న  తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలు రైతుల మహాపాదయాత్ర విజయవంతంగా అరసవల్లి చేరుకుంటే..  మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలనే   డిమాండ్  మరింత బలంగా తెరమీదకు వస్తుందని భావిస్తున్నారు.

 అదే జరిగితే  ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారుతుందన్న ఆందోళనా వారిలో వ్యక్తమౌతోంది. అందుకే అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు కల్పించాలని పార్టీ క్యాడర్ కు స్పష్టమైన సూచనలిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే రాజమండ్రిలో ఎంపీ భరత్ ఆధ్వర్యంలో దాడి జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల మహాపాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించడంతోనే అలజడులు సృష్టించైనా ఆ యాత్రను అడ్డుకోవాలని విస్పష్టమైన ఆదేశాలను పార్టీ శ్రేణులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందినట్లు చెబుతున్నారు.  

ఇప్పటికే పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు విశాఖ, రాజమండ్రి, కాకినాడలో నిర్వహించారు.. మరికొన్ని చోట్ల నిర్వహించేందుకు సన్నాహాలు  చేస్తున్నారు. అలాగే రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ భారీ ఫ్లెక్సీలు సైతం రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఇక ఈ పాదయాత్రలో పాల్గొన్న వారంతా పెయిడ్ అర్టిస్టులు, రియల్టర్లు, చంద్రబాబు బినామీలంటూ అధికార పార్టీ గుప్పిస్తున్న విమర్శల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే విశాఖ రాజధాని కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల డ్రామాకు సైతం తెరతీశారు.

అయితే ఆ డ్రామా ఒక్క రోజులోనే తుస్సుమంది. ఇక విశాఖ గర్జన కోసం ఏర్పాటైన ఉత్తరాంధ్ర జేఏసీ గర్జన వైఫల్యం తరువాత ఏమైందో ఎవరికీ తెలియదు.   ఇలా ఉండగా అమరావతే ఏకైక రాజధాని అంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు అధికార వైసీపీ మినమా అన్ని రాజకీయ పార్టీలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.  ఈ నేపథ్యంలోనే వైసీపీలో అసహనం పెచ్చరిల్లి ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీసీ గూండాలు ఉత్తరాంధ్రలో కోనసీమలోలా విధ్వంసానికి తెగబడే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు.

ఇక తెలుగుదేశం పార్టీ నేతలు అయితే.. వైసీపీ విధ్వంసయత్నాలకు రాజమండ్రిలో మహాపాదయాత్రపై జరిగిన దాడి ఒక శాంపిలా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా విధ్వంస రచనకు అధికార పార్టీ వ్యూహాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.