కడప వైసీపీ ఖాళీ అయిపోతోందా?

Publish Date:Mar 2, 2026

Advertisement

వైసీపీకి పెట్టని కోట లాంటి కడప బీటలు వారుతోంది. ఆ పార్టీకి కడప జిల్లాలో ముందు గొయ్యి, వెనుక నుయ్యి వంటి పరిస్థితి ఏర్పడిందా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే మస్తున్నది. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి గట్టి బలమున్న కడప జిల్లా  ప్రస్తుతం వైఎస్ కుటుంబం పట్టు జారిపోతోంది. వైసీపీని వీడి వెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సొంత జిల్లాలోనే పార్టీ నుంచి వలసనలను నిరోధించడంలో వైసీపీ అధినేత జగన్ విఫలమౌతున్నారు. ఇందుకు ప్రధాన కారణం జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక  కారణమైతే..  రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా  కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది. దశాబ్దాల విశ్వాసాన్ని పక్కన పడేసి జగన్ కు దూరం జరగడానికీ, వైసీపీకి గుడ్ బై చెప్పడానికీ తహతహలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  జిల్లా నేతలు వైసీపీని వీడటానికి సమయం కోసం వేచి చూస్తున్నారన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు తరువాత నుంచీ జిల్లాలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ బైపోల్ లో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక ఘోర పరాజయం పాలైన తరువాత.. కనీసం ఖర్చులైనా ఇవ్వండంటూ మొరపెట్టుకుంటే పార్టీ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో  ఆ ఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సహా.. ఆయనకు మద్దతుగా నిలిచిన వైసీపీయులు ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి పరులుగా మారిపోయారు.   అదలా ఉంటే.. ఇక ఇప్పుడు కడప కార్పొరేషనూ వైసీపీ చేజారిపోయేలా కనిపిస్తున్నది. ఎలాగైనా కడప కార్పొరేషన్ విషయంలో ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీరెడ్డి పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఆమె చొరవతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు   శివ‌కోటిరెడ్డి, రామ్‌ల‌క్ష్మ‌ణ్‌రెడ్డి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి సమక్షంలో సైకిలెక్కేశారు.

 వీరికంటే ముందే   8 మంది కార్పొరేట‌ర్లు దేశం గూటికి చేరిపోయారు. తాజా చేరికలలో కడప కార్పొరేషన్ లో వైసీపీని వీడిన కార్పొరేటర్ల సంఖ్య పదికి చేరింది.  రానున్న రోజులలో మరిన్ని జంపింగ్ లు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కడపలో వైసీపీ ఖాళీ అవుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో వైసీపీ కార్యక్రమాలు  తూతూమంత్రం చందంగా సాగుతుండటాన్ని చూపుతూ, చుట్టపు చూపుగా జగన్ వచ్చినప్పుడు తప్ప మిగిలిన రోజులలో జిల్లాలో వైసీపీ అసలు ఉందా అన్న వాతావరణమే కనిపిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.