ఇండియా కూటమికే వైసీపీ జై!?

Publish Date:Aug 8, 2024

Advertisement

వైసీపీ తన బాట ఏమిటో నిర్ణయించేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత కేంద్రంలో బీజేపీకి వత్తాసు పలకడం వల్ల ఇక ఉపయోగం లేదని నిర్ణయించుకుందా? అంటే గురువారం (ఆగస్టు 8) లోక్ సభలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు చూస్తే ఔనని అనిపించక మానదు. జగన్ తన మెడపై వేళాడుతున్న అక్రమాస్తుల కేసుల నుంచి బీజేపీ రక్షిస్తుందన్న ఉద్దేశంతో ఆ పార్టీ తెలుగుదేశంతో జత కట్టినా ఇప్పటి వరకూ మోడీపై కానీ, కమలం పార్టీపై కానీ విమర్శలకు పాల్పడలేదు.

చంద్రబాబు సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయంటూ ఆయన హస్తినలో ధర్నా చేసిన సమయంలో కూడా ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీని పల్లెత్తుమాట అనలేదు. అదే సమయంలో ఇండియా కూటమి పార్టీలను ధర్నాకు ఆహ్వానించారు. ఒక విధంగా తనకు మద్దతు ఇవ్వకుంటే రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తేందుకు, బిల్లుల ఆమోదం విషయంలో సహాయ నిరాకరణ చేసేందుకు వెనుకాడేది లేదన్న సందేశాన్ని పంపారు. అక్కడితో ఆగకుండా ధర్నా అనంతరం తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని రెండు సార్లు కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అయిన అమిత్ షా వద్దకు రాయబారానికి పంపారు. అయితే అవేమీ ఫలించకపోవడంతో ఇక  అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధపడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆ విశ్లేషణలకు అనుగునంగానే వైసీపీ సభ్యులు లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించింది.  మోడీ సర్కార్ లోక్ సభలో వక్ఫ్ బోర్డు బిల్లును గురువారం (ఆగస్టు 8) లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. లోక్ సభలో వైసీపీ వ్యతిరేకత వల్ల మోడీ సర్కార్ కు ఎటువంటి ఇబ్బందీ కలగదన్న సంగతి విదితమే. అయితే ప్రస్తుత పరిస్థితిలో రాజ్యసభలో కూడా వైసీపీ ఇదే పద్ధతిని అనుసరిస్తే బీజేపీకి ఒకింత ఇబ్బందే. దీంతో లోక్ సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీ తన అడుగులు ఇండియా కూటమి వైపే అన్నస్పష్టమైన సంకేతాన్ని పంపారు.

దీంతో ఇక రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం లేకుండానే బిల్లుల ఆమోదానికి అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే వైసీపీ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో బీజేపీ టచ్ లోకి వెళ్లింది. ఇక ఆ పార్టీల నుంచి కమలంలోకి జంపింగులు షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇంత వరకూ అటూ ఇటూ అన్నట్లుగా ఊగిసలాట ప్రదర్శించిన జగన్ ఇక కమలం పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ వ్యతిరేకించడం ద్వారా తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.