జగన్ కి వైసీపీ ఎంపీల రాజీ ‘నామాలు’?

Publish Date:Aug 1, 2024

Advertisement

వైసీపీ పతనం కొనసాగుతోంది. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ  పయనం పతనం నుంచి పతనం దిశగా వేగంగా సాగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ అధినేత ఢిల్లీ ధర్నా నవ్వుల పాలైంది. అలాగే విపక్ష హోదా కోరుతూ జగన్ కోర్టును ఆశ్రయించడం, హోదా ఇస్తే తప్ప సభకు హాజరు కాబోమనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీకి సమయం ఇవ్వకుండా విమర్శల దాడికి దిగడాన్ని వైసీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. కేతిరెడ్డి వంటి వారైతే ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతూ పార్టీకి దూరమైతే.. బొత్స వంటి  వారు మీడియా సమావేశాలలో పరోక్షంగా జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ హస్తిన వేదికగా చేపట్టిన ధర్నాకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టి మండలి సమావేశాలకు హాజరై తన ధిక్కారాన్ని వ్యక్తం చేశారు. 

ఇవన్నీ చాలవన్నట్లు జగన్ ధీమాను, ధైర్యాన్ని నీరుగార్చే విధంగా ఏకంగా ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామాస్త్రం ప్రయోగించడానికి రెడీ అయిపోయారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు రాజ్యసభలో పూర్తి బలం లేకపోవడంతో తన పదకొండు మంది రాజ్యసభ సభ్యుల అవసరం మోడీ ప్రభుత్వానికి ఉంటుందన్న ధీమా జగన్ లో ఉంది. ఇప్పుడా ధీమా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రాజ్యసభ సభ్యుల బలంతోనే ఆయన ఇండియా కూటమి వైపు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ బలమే లేకపోతే అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి జగన్ ను పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకే వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా బాట జగన్ ను భయపెడుతోంది. ఆందోళనకు గురి చేస్తున్నది. ఇంతకీ వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాల ప్రచారానికి తెరలేపిందెవరంటే స్వయంగా జగన్ సొంత పత్రికే.

ఆ పత్రికలో వైసీపీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యలు రాజీనామా చేయనున్నారని పేర్కొంది. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకీ రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరనున్నారనీ పేర్కొంది. అలా రాజీనామా చేసిన వారికి టీడీపీ మళ్లీ అదే రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందని జోస్యం కూడా చెప్పింది. తొలి నుంచీ అంటే సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీ నుంచి వలసలపై రాజకీయవర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాల వార్తతో ఆ వలసల ఒరవడి ఆరుగురితో ఆగే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.