రాజ్యసభలో వైసీపీ పక్షం మాయం?

Publish Date:Jul 16, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పులు పెను వేగంతో జరుగుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభావం, కేంద్రంలోని ఎన్డీయే కూటమిపై కూడా పడుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తన రాజకీయ నిర్ణయాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో చర్చించి, ఆయన ఆమోదంతోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది.

ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్  ఫలితాల తరువాత తన పార్టీ రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీకి మన అవసరం ఉంది. గట్టిగా నిలబడండి. బీజేపీయే కాళ్ల బేరానికి వస్తుంది అన్నట్లుగా ఉద్బోధ చేశారు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఉందని ఆయన భ్రమ పడ్డారు. అయితే వాస్తవానికి వచ్చే సరికి ఆయన కళ్లు బైర్లు కమ్మాయి. ఫలితాలు ఎలా అయితే తన చేతుల్లో లేవని అంగీకరించేశారో.. అలాగే ఇప్పుడు రాజ్యసభలో వైసీపీ బలం కూడా తనది కాదని ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఏపీ మండలిలో కూడా ముందు ముందు అదే జరిగే అవకాశం ఉంది. అది వేరే సంగతి. 

ఇప్పుడు రాజ్యసభలో వైసీపీ సభ్యలు వద్దకు వస్తే గంపగుత్తగా వారంతా బీజేపీ గూటికి వెళ్లి  వైసీపీ రాజ్యసభ పక్షాన్ని కమలం పార్టీలో విలీనం చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయంలో ఎలాంటి దాపరికం లేదు.  ఎందుకంటే జగన్ కు తమ సభ్యులు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా గొంతెత్తమని ఆదేశించే ధైర్యం లేదు. అక్రమాస్తుల కేసుల కత్తి మెడమీద వేళాడుతుండటంతో ఆయన కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా గట్టిగా నోరెత్తలేని పరిస్థితి. సో.. వైసీపీ సభ్యులు రాజ్యసభలో ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేసే అవకాశం లేదు. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం కూడా భాగస్వామి కావడంతో తెలుగుదేశంపైనా విమర్శలు చేసే సాహసం చేయలేని పరిస్థితి వైసీపీది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సభ్యులు బీజేపీవైపు చూస్తున్నారు. 

అయితే ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం అంగీకారం లేకుండా వైసీపీ రాజ్యసభ సభ్యులకు బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించే అవకాశం లేదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ అవసరాలను చంద్రబాబు పరిగణనలోనికి తీసుకోకుండా ఉండరు. అందుకే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో భేటీకి తహతహలాడుతున్నారు. వారి ఆహ్వానం మేరకే చంద్రబాబు హస్తినకు వెడుతున్నారు. కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రోజుల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తిన పర్యటన అంటే అందరూ రాష్ట్రానికి అవసరమైన నిధుల కేటాయింపుపై చర్చించడానికి అని భావిస్తారు. అది సహజం. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపుల విషయంలో ఎటువంటి అన్యాయం జరగదన్న స్పష్టమైన హామీ వచ్చేసిందని అంటున్నారు.  దీంతో ఇప్పుడు చంద్రబాబు హస్తిన పర్యటన అజెండా రాజకీయ అంశమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఎన్డీయే కూటమికి రాజ్యసభలో అవసరమైన బలం లేదు. ఒడిశాలో ఓటమి తరువాత బీజేడీ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవు. దీంతో బీజేపీ చూపు వైసీపీ రాజ్యసభ సభ్యులపై పడింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆ సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకునే విషయంపై చంద్రబాబుతో చర్చలకు బీజేపీ అగ్రనేతలు ముందుకు వచ్చారు. బహుశా ఆ విషయంపై చర్చించేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అని అంటున్నారు. 
ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోచవ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి,  ఎన్డీఏకు మెజారిటీ కావాలంటే వైసీపీ, బీఆర్ఎస్ సభ్యులను చేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆ విషయం తెలిసిన చంద్రబాబు ఇందుకు అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నేడో రేపో వైసీపీ రాజ్యసభ సభ్యులు కమలం తీర్థం పుచ్చుకుని వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఈ తంతు చంద్రబాబు సమక్షంలో జరిగినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రం పుంజుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకాయం కేంద్రం నుంచి వస్తే చాలు అన్నఉద్దేశంతో ఉన్న చంద్రబాబు వైసీపీ  రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరికకు అభ్యంతరం పెట్టే అవకాశాలు తక్కువేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.