అప్పుడు అజ్ఞానవాసం.. ఇప్పుడు అజ్ఞాతవాసం!

Publish Date:Sep 9, 2024

Advertisement

మహాభారతంలో అరణ్యవాసం, అజ్ఞాతవాసం తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అజ్ఞానవాసం ముగిసి ఇప్పుడు అజ్ఞాతవాసం నడుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో పైనున్న ప్రధాన నాయకుల దగ్గర్నుంచి చిట్టచివరన వున్న కార్యకర్తల వరకూ ఎవరూ విజ్ఞానంతో వ్యవహరించలేదన్న విమర్శలు వున్నాయి. మేం అధికారంలో వున్నాం, మేం ఏం చేసినా నడుస్తుంది. ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు. మేం చేసే పనులను కళ్ళు అప్పగించి చూడ్డం మినహా నోరు తెరచి ప్రశ్నించకూడదనే విధంగా వాళ్ళ ధోరణి వుండేది. దీనిని భరించలేక ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద వేధింపులు, కేసులు, అరెస్టులు, దాడులు తప్పేవి కావు. సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునే జైలుకు పంపిన స్థాయిలో ఆనాడు  వైసీపీ నాయకుల విజ్ఞానం వర్ధిల్లింది. అలా ఐదేళ్ళపాటు కొనసాగిన వైసీపీ నాయకుల అజ్ఞానవాసం ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అజ్ఞాతవాసంగా మారింది.

ఐదేళ్ళ అధికార అంధకారంలో వైసీపీ నాయకులు చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి కేసుల రూపంలో వాళ్ళనే చుట్టుకుంటున్నాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చాలామంది అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టుగా ఎవరు చేసిన తప్పులు వాళ్ళని వెంటాడుతూ వేధిస్తున్నాయి.  తప్పులు చేయడం మావంతు.. తప్పించుకుని తిరగడమూ మావంతే అన్నట్టుగా తప్పించుకుని తిరుగుతున్నారు. తాము ఎక్కడున్నదీ బయటకి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. బ్యాడ్‌లక్ ఏంటంటే, కేసులలో ఇరుక్కున్న వైసీపీ నాయకులు ఎంత అజ్ఞాతంలో వున్నా పోలీసులు కలుగులోంచి ఎలుకలను బయటకి లాగినట్టుగా లాగుతూ అరెస్టు చేస్తున్నారు. అజ్ఞాతవాసాన్ని భగ్నం చేస్తున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.