రాములోరి భూములనూ వదలని వైసీపీ నేతలు!

Publish Date:Oct 24, 2023

Advertisement

రాయలసీమ నుండి కృష్ణా జిల్లా వరకూ.. గోదావరి జిల్లాల నుండి ఉత్తరాంధ్ర వరకూ వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన భూకబ్జాలు అన్నీ ఇన్నీ కావు. రాజధాని పేరిట విశాఖలో ఈ భూ అరాచకాలు కోకొల్లలు. ప్రకాశం జిల్లా కేంద్రంగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి దగ్గరి బంధువే భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల బండారాన్ని మరో వైసీపీ నేతే బయట పెట్టారు. ఈ వ్యవహారంలో పదిమందిని అరెస్ట్ చేయగా.. ఈ కేసులో కీలక నేతలు కూడా అరెస్ట్ కావాల్సి ఉందని సదరు వైసీపీ నేతే చెప్తున్నారు. ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే చాలు సొంతం చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు అధికార పార్టీ నేతలు. ఎక్కడ పోరంబోకు భూములు కనిపించినా మండలస్థాయి నేతల నుండి జిల్లా స్థాయి నేతల వరకూ ఎవరికి వారు  కబ్జాకు దిగుతున్నారు. కేవలం ప్రజల భూములే కాదు దేవుడి భూములను కూడా వదలడం లేదు. సుపరిపాలన అందించి ఆదర్శమూర్తిగా మూర్తీభవించిన సాక్షాత్తు శ్రీరాముల వారి భూములను కూడా మింగేశారు.

 ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో 917 ఎకరాల భూమిని 1878లో సోమరాజు పురుషోత్తమరాజు రిజిస్టర్‌ డీడ్‌ ద్వారా భద్రాచలం దేవస్థానానికి బహూకరించారు. ఈ భూమి రాములవారిదే అయినా స్థానికులు కొందరు ఆక్రమించుకొన్నారు. ఈ భూముల విషయంలో దేవస్థానానికి వ్యతిరేకంగా ఆక్రమించుకున్న వారు  వివిధ కోర్టుల్లో కేసులు వేయగా దేవస్థానానికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. ఈ భూములకు దేవస్థానం పేరుతో పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు కూడా ఉండగా ఆన్‌లైన్‌లో కూడా వివరాలన్నీ దేవస్థానం పేరుతోనే ఉన్నాయి. 2005 నుంచి 2010 వరకు ఎకరాకు రూ.1,000 చొప్పున ఆక్రమణదారుల నుంచి డ్యామేజెస్‌ ఫర్‌ యూజ్‌ అండ్‌ ఆక్యుపేషన్‌ చార్జెస్‌ కింద వసూలు చేయగా 2021-22 నాటికి దీనిని రూ.4 వేలకు పెంచారు.  

కాగా, రాష్ట్ర విభజన సమయంలో భదాద్రి దేవస్థానం తెలంగాణకు వెళ్లగా.. భద్రాద్రికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో భూములు ఉన్న ఈ భూములున్న ప్రాంతం పురుషోత్తమ పట్నం ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. అయితే, ఆక్రమణదారులు 2018 నుంచి ఆక్యుపేషన్‌ చార్జెస్‌ చెల్లించకపోగా.. చెల్లించేదిలేదని కరాఖండిగా చెప్తున్నారు. సరిగ్గా ఇక్కడే స్థానిక వైసీపీ నేతలు ఎంటరై ఆక్రమణదారులకు కాపాడడమే కాకుండా.. మరికొంత భూములను కూడా  కబ్జా చేసినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ మధ్యనే దేవస్థానం ఈ భూములను స్వాధీనం చేసుకొనేందుకు  ప్రయత్నాలు మొదలెట్టింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములలో 110 ఎకరాలలో దాతల సహకారంతో గోశాల నిర్మాణం చేపట్టారు. అయితే, ఈ నిర్మాణాన్ని ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారు. దేవస్థాన భూములను తిరిగి అప్పగించాల్సిన వివిధ శాఖల అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. మొత్తం 14 శాఖలు ఈ భూములకు రక్షణ కల్పించి దేవస్థానికి అప్పగించాల్సి ఉంది. హైకోర్టులో ఈ కేసు దాఖలైన రోజు నుండీ ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఇప్పుడు హైకోర్టు ఈ వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ భూములను ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చి, ఇక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించి దేవస్థానికి భూములు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ కబ్జా వ్యవహారం అంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తున్నది. భూములలో అక్రమ కట్టడాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ సిబ్బందిని దుర్భాషలాడిన అక్రమార్కులు, దాడులకు యత్నించారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, దేవాదాయ లాంటి మిగతా శాఖలు కూడా ఈ విషయంలో భద్రాద్రి ఆలయ అధికారులకు సహకరించడం లేదు. ఏపీ ప్రభుత్వం నుండి కనీస స్పందన కూడా రావడం లేదు. అయితే, దీని వెనక బడా వైసీపీ నేతల హస్తం ఉండడమే ఏపీలో ఏ శాఖ నుండి సహకారాలు అందడం లేదని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ అండదండలతో కబ్జా దారులు ఈ వ్యవహారంలో భద్రాద్రి అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరి ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో అయినా అధికారులు కబ్జాదారుల నుండి దేవాలయ భూములను ఖాళీ చేసి తిరిగి అప్పగిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.