పార్టీని చంపేసింది జగనే.. వైసీపీలో మొదలైన పోస్టుమార్టం!

Publish Date:Jun 24, 2024

Advertisement

ప్రత్యర్థి పార్టీలు సైతం పార్టీలు సైతం జాలిపడేంత ఘోర ఓటమి పాలైన వైసీపీ.. ఇప్పుడు తమ ఓటమికి కారణాలపై పోస్టు మార్టం మొదలు పెట్టింది. అయితే ఈ పని చేస్తున్నది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ కాదు. ఇంత కాలం అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం జగన్ మాటే శిలాశాసనం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలు, మాజీ మంత్రులు. అది కూడా జగన్ మీద ఈగ వాలకుండా పార్టీలోని కొందరిని టార్గెట్ చేసి చేస్తున్న ఈ పోస్టు మార్టం వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖలో  అక్రమంగా నిర్మితమైన వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించడంపై స్పందించారు. అయితే ఆయన స్పందన పార్టీ కార్యాలయ నిర్మాణం అక్రమమని అంగీకరిస్తూనే.. కూల్చివేతకు పాల్పడి మేం చేసిన తప్పు మీరు చేయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి.  ప్రజావేదిక నుంచి తమ పార్టీ చేసిన విధ్వంసం కారణంగానే ఘోరంగా ఓటమి పాలయ్యామని అంగీకరించేసినట్లుగా  వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు ఉన్నాయి. 

ఇక అదే పార్టీకి చెందిన మరో నేత కాసు మహేష్ రెడ్డి అయితే.. ప్రత్యర్థి నేతలపై అనుచిత భాషా ప్రయోగం వల్లే వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుందని మీడియా ముందు అంగీకరించేశారు. అలాగే నారా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం కూడా పార్టీ పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటని ఒప్పేసుకున్నారు. 
చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు కారణంగా జనాగ్రహం జగన్ సర్కార్ పతనాన్ని శాశించిందని కాసు మహేష్ రెడ్డి సోదాహరణంగా  వివరణ ఇచ్చారు. బేంగళూరులో ఐటీ ప్రొఫెషనల్ ఒకరు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ ఒంటి పూట భోజనమే చేస్తానని శపథం చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే వరకూ నల్ల చొక్కాలే ధరించిన సంగతి చెప్పారు.  అంతే కాదు రాజకీయాలతో సంబంధం లేని  కుటుంబాలు కూడా వైసీపీ ఓటమి కోరుకుంటూ మొక్కుకున్న సంగతిని చెబుతూ.. జగన్ ప్రభుత్వం గద్దెదిగిన తరువాత తిరుమలకు వెళ్లి   తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్న కుటుంబాలు అనేకం ఉన్నాయని చెప్పారు.

ఇవన్నీ వైసీపీ నాయకుడు కాసు మహేష్ రెడ్డి మీడియా ముందు చెప్పిన సత్యాలు. అనుచిత వ్యాఖ్యలు అంటూ  కొడాలి నాని వంటి ఒకరిద్దరి పేర్లతో ఆయన విమర్శలు చేశారు కానీ.. వాస్తవంగా ఆయన ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలన్నీ జగన్ కు ఎక్కుపెట్టినవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అనుచిత భాష వాడుతున్న నేతలను కంట్రోల్ చేయడమటుంచి.. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన విమర్శలూ కూడా నాని తదితరుల భాషా పాండిత్యానికి ఏమీ తక్కువకాదని వివరిస్తున్నారు.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.