పెమ్మ‌సాని జోరు.. వైసీపీ బేజారు!

Publish Date:Apr 6, 2024

Advertisement

గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీకి కిలారు రోశయ్య వెనుకంజ

మళ్లీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్

అళ్లను బరిలోకి దింపే యోచన

ఓడినా సరే పోటీ చేయాలని ఆర్కేకు జగన్ హుకుం?

ఏపీలో ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు.. ఆ పార్టీని గ‌ద్దెదింపేందుకు సిద్ధమైపోయారు. మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన బ‌స్సు దాదాపు తుస్సుయాత్రగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు నానా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని స‌ర్వేలు చెబుతున్నాయి.  దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో వివేకానంద రెడ్డి హ‌త్య కేసు, కోడి కొత్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతితో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. కానీ, ఈసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం చెప్పేందుకు అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఏకమైనట్లు కనిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు ముందుగానే ఓట‌మిని ఒప్పుకొని పోటీనుంచి వైదొలిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసేందుకు వైసీపీ అభ్య‌ర్థులు వ‌ణికిపోతున్నారని చెబుతున్నారు. ఓడిపోయే సీటులో పోటీచేసేకంటే.. ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండ‌ట‌మే బెట‌ర్ అనే నిర్ణ‌యానికి వైసీపీ అభ్య‌ర్థులు వ‌స్తున్నారు.

గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త రెండు ద‌ఫాలుగా తెలుగుదేశం అభ్య‌ర్థిగా గల్లా జ‌య‌దేవ్ విజ‌యం సాధించారు. ఈసారి ఆయ‌న రాజ‌కీయాల‌కు విరామం ఇవ్వ‌డంతో  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. చంద్ర‌శేఖ‌ర్ గ‌త కొన్నేళ్లుగా గుంటూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వ‌స్తున్నారు. పేద వ‌ర్గాల ప్ర‌జ‌లకు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వారికి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. పెమ్మ‌సానికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచిపేరు ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని విజ‌యం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

దీంతో పెమ్మ‌సానిపై పోటీ చేసేందుకు వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు పోటీ నుంచి త‌ప్పుకున్నారు. చివరకు జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు కిలారు కోశ‌య్య‌ గుంటూరు పార్ల‌మెంట్  నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయ‌నకూడా పోటీ నుంచి త‌ప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ క్యాడ‌ర్ సైతం పెమ్మ‌సానికే జై కొడుతున్నారనీ,  దీంతో పోటీలో నిలిచి ఓడిపోవ‌డం కంటే పోటీ నుంచి త‌ప్పుకోవ‌టం మేల‌న్న భావ‌న‌కు కిలారు రోశ‌య్య వ‌చ్చారనీ గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలుత క్రికెటర్ అంబటి రాయుడును బ‌రిలోకి దింపాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావించారు. అయితే, ఆయన పార్టీలో చేరిన కొద్దికాలంకే వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో గుంటూరు పార్ల‌మెంట్‌ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా న‌ర్స‌రావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులును పోటీ చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఆయ‌న అందుకు స‌సేమిరా అన‌డంతో న‌ర్స‌రావుపేట నుంచి మ‌రోసారి టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ నిరాక‌రించాడు. దీంతో శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు తెలుగుదేశంలో చేరి మ‌రోసారి న‌ర్స‌రావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు.  గుంటూరు పార్ల‌మెంట్ కు పోటీచేసేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌టంతో  వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయ‌న‌కూడా పోటీ చేసేందుకు నిరాస‌క్త‌త‌ను వ్య‌క్తం చేయడంతోపాటు.. రెండు వారాలైనా నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. దీంతో ఉమ్మారెడ్డి అల్లుడు అయిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యను గుంటూరు అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దించారు.  ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే  ఇప్పుడు ఆయ‌న‌సైతం పోటీనుంచి త‌ప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పెమ్మ‌సాని రాజ‌కీయ‌ వ్యూహాల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు సైతం ఫిదా అవుతున్నార‌ట‌. దీంతో ప‌లువురు వైసీపీ నేత‌లు సైతం లోపాయికారికంగా పెమ్మ‌సాని విజ‌యంకోసం ప‌నిచేస్తున్నార‌న్న ప్ర‌చారం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్నది. దీంతో ఎంత ప్ర‌య‌త్నించినా నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజ‌యం అసాధ్య‌మ‌ని కిలారు రోశ‌య్య పార్టీ నేత‌ల వ‌ద్ద పేర్కొన్నార‌ని సమాచారం. పెమ్మ‌సాని విజ‌యాన్ని ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డంకంటే త‌ప్పుకోవ‌టం మేల‌న్న భావ‌న‌ను పార్టీ నేత‌ల వ‌ద్ద కిలారు రోశ‌య్య ప్ర‌స్తావించిన‌ట్లు గుంటూరు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి ఆయ‌న‌పై పోటీకి వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ అభ్య‌ర్థిగాఉన్న కిలారు రోశ‌య్య కూడా పోటీనుంచి త‌ప్పుకుంటాన‌ని వైసీపీ అధిష్టానం వ‌ద్ద వెల్ల‌డించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కిలారు రోశ‌య్య స్థానంలో గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఓడిపోయినా స‌రే.. పోటీలో మాత్రం ఉండ‌డాల‌ని వైసీపీ అధిష్టానం ఆళ్ల‌కు సూచించిన‌ట్లు సమాచారం. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి కోసం  ప్ర‌చారం చేస్తున్నారు.  మొత్తానికి గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ దెబ్బ‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే వైసీపీ ఓట‌మిని ఒప్పుకున్న‌ట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.