గోబెల్స్ ను మించిపోయిన వైసీపీ ప్రచారం

Publish Date:Feb 12, 2026

Advertisement

శుద్ధ అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. అటువంటి ప్రచారంలో వైసీపీది అందె వేసిన చేయిగా పరిశీలకులు అంటున్నారు. అయితే వైసీపీ ఓటుకు నోటు కేసులో అలుపులేకుండా చేస్తున్న అబద్ధపు ప్రచారం ఫలితం ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇందుకు కారణాలను కూడా సహేతుకంగా విశ్లేషిస్తున్నారు.  ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఉన్నారనీ, ఆ కేసు కోసమే తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డితో చంద్రబాబు రాజీపడుతున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తున్నది. గతంలో అంటే తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో కూడా అప్పడు ఏపీ సీఎంగా కేసీఆర్ తోనూ చంద్రబాబు లాలూచీ రాజకీయం నెరపారని వైసీపీ ప్రచారం చేస్తున్నది. 

అయితే వాస్తవానికి  ఓటుకు నోటు కేసులో   చంద్రబాబు ముద్దాయి కాదు.  చార్జిషీట్ లో ఆయన పేరు లేదు. కాగా చంద్రబాబు పేరు ఓటుకు నోటు కేసులో లేకపోవడంపై గతంలో వైసీపీ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే అక్కడ ఆ పార్టీకి చుక్కెదురైంది. ఆ తరువాత సుప్రీంను కూడా ఆశ్రయించింది.. అక్కడా వైసీపీకి ఎదురుదెబ్బే తగిలింది.   ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన వైసీపీకి పరాభవం తప్పలేదు.  

అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్నిప్రమాదాన్నిఆసరాగా తీసుకుని రాజకీయం కోసం మళ్లీ ఓటుకు నోటు కేసును వాడేసుకుంటోంది. దానితో పాటు ఓటుకు నోటు కేసు కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నిలిపి వేయించారని  వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అదెలాగంటే.. ఓటుకు నోటు కేసు కు సంబంధించిన కీలక వివరాలు ఆ ల్యాబ్ లో ఉన్నాయి. ఆ ఫైల్స్ దగ్ధం చేసేందుకు రేవంత్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారనీ ఆరోపిస్తోంది.  అదే ఓటుకు నోటు కేసులో రేవంత్ సైతం ఉండడంతో ఆ ఇరువురూ   కలిసి   అగ్ని ప్రమాదం చేయించారని ఆరోపిస్తూ.. ఇందు కోసం చంద్రబాబు రేవంత్ కు అనుకూలంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని చెబుతోంది. 

ఇక ఓటుకు నోటు కేసు విషయానికి వస్తే.. 2015లో ఓ నామినేటెడ్  ఓ నామినేటెడ్ ఎమ్మెల్సీ ని ప్రలోభ పెట్టారన్న కేసులో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు.  ఆ కేసులో చంద్రబాబు ప్రస్తావనే లేదు.  అయితే కోర్టుకు దాఖలు చేసిన చార్జి షీట్లో   చంద్రబాబు ప్రస్తావన ఒకచోట ఉంది. దీనిపైనే గతంలో  వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కోరారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్నారెడ్డి  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటీషన్ డిస్మిస్ చేసింది. ఇది జరిగి సంవత్సరాలు గడిచిపోయినా వైసీపీ మాత్రం ఆ ఆరోపణలనే పట్టుకు వెళాడుతోంది. 

ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం విషయానికి వస్తే.,. ఆ అగ్నిప్రమాదంలో  ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ టాపింగ్ కేసునకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కాలేదని సంబంధిత అధికారులు విస్పష్టంగా ప్రకటించారు. అయినా సరే  వైసీపీ తన తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణలో విపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా ఓటుకు నోటు కేసు ఫైల్స్ దగ్ధం కోసమే ఆ కేసులో ఏ1గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించిందని ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. తెలంగాణ సీఎం రేవంత్ ను కేసులో ఏ1గా చార్జిషీట్ లో పేర్కొన్నందున బీఆర్ఎస్ ఆరోపణలు చేయడాన్నితప్పుపట్టలేం. 

కానీ వైసీపీ  మాత్రం ఓటుకు నోటు ప్రస్తావన తీసుకొస్తూనే ఉంది. కోర్టుల్లో మొట్టికాయలు తిన్న తరువాత కూడా ఆ పార్టీ ఆ ప్రచారం కొనసాగిస్తుంది. ఇక ఈ కేసు కోసం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశారని మరో అబద్ధాన్ని కూడా ప్రచారంలోకి తీసుకు వచ్చింది. వాస్తవానికి  2020 లోనే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అప్పటి జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టారు.అయితే కేంద్రం అందుకు అనుమతులు ఇవ్వలేదు. వాస్తవం అలా ఉంటే.. ఏపీలో 2024 ఎన్నికలలో విజయం సాధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టిన తరువాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని వైసీపీ చెప్పడం కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న అసత్య ప్రచారమేనంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.