వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కుప్పం విషయంలో ఆ పార్టీ నేతలు పెచ్చులు మాట్లాడారు. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. 2024 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం వైసీపీ ఖాతాలో పడటం ఖాయమంటూ గప్పాలు కొట్టారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన స్థాయిని మించి వ్యవహరించారు. కుప్పం స్థానిక సంస్థలను అధికార బలంతోనూ, సొమ్ములు గుమ్మరించడం ద్వారా లాక్కొని ఇంకే ముంది కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందంటూ విర్రవీగారు. 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ఇంకేముంది కుప్పంలో చంద్రబాబు ఘోర పరాజయం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిజంగానే కుప్పంలో వైసీపీ బలపడిందా అన్న భ్రాంతి కలిగేలా వారి తీరు అప్పట్లో ఉంది. అయితే అదంతా కేవలం గాలి బుడగ వాటమని 2024 ఎన్నికలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన మరుక్షణం ఐదేళ్ల పాటు కుప్పంలో అరాచకాలు చేసి చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వారు కూడా కనిపించకుండా వెళ్లిపోయారు. పోటీ చేసి ఓడిపోయిన భరత్ అసలు అడ్రస్ లేరు. అక్కడే ఉన్న వాళ్లు టీడీపీలో చేరిపోతామని బతిమాలుకుని ఆ పని పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పంలో వైసీపీ జెండా పట్టుకునేవారు కరువయ్యారు. చంద్రబాబును ఓడించేస్తానని హడావుడి చేసిన పెద్దిరెడ్డి కూడా అటు వైపు చూడటం లేదు. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది.
చంద్రబాబు సునాయాసంగా కుప్పం నుంచి వరుసగా ఎనిమిదో సారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పటిదాకా కుప్పం మాదే నంటూ విర్రవీగిన వైసీపీయులు ఓటమి తరువాత నియోజకవర్గంలో కలికానిక్కూడా కనిపించకుండా పోయారు. కుప్పం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కె.ఆర్.జె.భరత్ హైదరాబాద్‌కు మకాం మార్చేశారు.
ఇక ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా తెలుగుదేశం వశమౌతున్నాయి. కుప్పం మునిసిపల్ చైర్మర్ సుధీర్ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. మొత్తానికి కుప్పంలో వైసీపీ ఖాళీ అయిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-empty-in-kuppam-25-187960.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!