ఔను వాళ్లిద్దరూ కలిశారు.. ఇక వైసీపీ పని దబిడి దిబిడే!

Publish Date:May 2, 2023

Advertisement

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడుపు ఖరారైందన్న సంకేతాల మధ్య వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయింది. అందుకే ఆ పార్టీ నాయకులు జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ వంటి స్టార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలే కాదు దూషణలకు కూడా వెనుకాడటం లేదు. ఒక ఎమ్మెల్యే అయితే జనాగ్రహాన్ని తట్టుకోలేక, సొంత పార్టీ శ్రేణులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోవడాన్ని సహించలేక సొంత పీఏపైనే చేయి చేసుకుని ఫ్రస్ట్రేషన్ ను బయటపెట్టుకున్నారు.

ఇక ఆ పార్టీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణం రాజు తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే వైసీపీ ఔట్ అని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలూ కలిస్తే వసీపీ బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోవడం తథ్యమన్నారు.  ఏపీకి విశాలమైన తీర ప్రాంతం ఉంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే..  ఆ విశాల  తీర ప్రాంత గర్భంలో  వైసీపీ కలిసిపోతుందని రఘురామ రాజు జోస్యం చెప్పారు. నెల్లూరు టు శ్రీకాకుళం, రాయలసీమ యిలా  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన అన్నారు.

 అవినాష్ రెడ్డి అరెస్టుపై  దాగుడుమూతల పర్వం  సాగుతున్నప్పటికీ.. ఆయన అరెస్టు కావడం ఖాయమన్న అభిప్రాయాన్ని రఘురామ రాజు సోమవారం(మే1)  రచ్చబండ లో భాగంగా మీడియాతో చెప్పారు.  యిప్పటికే ఏపీ ప్రజలు రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే వైసీపీని వదిలించుకోకతప్పదన్న నిర్ణయానికి వచ్చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ఇక తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ కూడా కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రఘురామ రాజు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే బీజేపీకి తెలుగుదేశం, జనసేనలతో కలవక తప్పదనే అనిపిస్తోందన్నారు.  రానున్న ఎన్నికల్లో  రాష్ట్రంలో రెండవ స్థానంలో  అధికార వైసీపీ కచ్చితంగా ఉంటుంది. యిది యిప్పటికే ప్రజలు తీసేసుకున్న నిర్ణయం. సో ప్రజల నిర్ణయాన్ని గౌరవించి రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకం కావాలి. అవుతాయి అని రఘురామ అన్నారు.

 క్షేత్రస్థాయిలో ఇప్పటికే టిడిపి, జనసేన కార్యకర్తలు కలిసి పని చేస్తున్నారు.  అంటే రెండు పార్టీల క్యాడర్ ఎప్పుడో కలిసిపోయింది. యిప్పుడు నాయకులు కలుస్తున్నారు. అది వారికి అనివార్యంగా పార్టీ క్యాడర్ మార్చేసింది. దీంతోనే వైసీపీకి బ్యాడ్ టైం మొదలైంది అని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో గతం లో వైసీపీకి 50 % ఉన్న ఓటు బ్యాంక్  గణనీయంగా తగ్గింది. టీడీపీ కి కష్టకాలంలోనూ  40% ఓటు బ్యాంకు ఉండగా, ఇప్పుడు అది భారీగా పెరిగిందని చెప్పిన వైసీపీ రెబల్ ఎంపీ.. ఏ విధంగా చూసినా వైసీపీ రానున్న ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారాన్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.