కూటమి సర్కార్ గుడ్ న్యూస్.. రేపటి నుంచే తల్లికి వందనం పథకం అమలు
Publish Date:Jun 11, 2025
Advertisement
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీ తల్లికి వందనం పథకాన్ని తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం (జూన్ 12) నుంచి అమలు చేయనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి గురువారం నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆరంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ పథకం కింద గురువారం (జూన్ 12) నిధులు విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద తల్లుల ఖాతాలలో 8 వేల 745 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ పొందిన పిల్లల నుంచి ప్లస్ వన్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వరకూ అందరికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇహనో, ఇప్పుుడో జీవో విడుదల చేయనుంది. ఇలా ఉండగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఈ పథకంతో కలిపి ఇప్పటి వరకూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఐదు పథకాలను అమలు చేసినట్లౌతుంది. సూపర్ సిక్స్ పథకాలైన పింఛన్ల పెంపు, అన్నా క్యాంటిన్లు, మెగా డీఎస్సీ, దీంపం్ర2 పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇక సూపర్ సిక్స్ హామీలలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మిగిలి ఉంది. ఆ పథకాన్ని కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
http://www.teluguone.com/news/content/yalliki-vandanam-scheme-implimentation-from-tomorrow-25-199728.html





