Publish Date:May 22, 2023
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వైనాట్ 175 అంటుంటే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ మాత్రం 175 షూర్ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 కి 175 స్థానాలలోనూ విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ఇష్టాగోష్టిగా విలేకరులతో ముచ్చటించారు.
ఆ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఎదురైన ప్రశ్నకు ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఆ వ్యవహారం సీబీఐ చూసుకుంటుంది. నీకెందుకు? నాకెందుకు? అంటూ మండి పడ్డారు. నువ్వేమైనా సీబీఐ చీఫ్ వా..? నీకు నేను సమాధానం చెప్పాలా? మాకు అదే పనా? మీ హద్దులు మీకు ఉంటాయ్... మా హద్దులు మాకు ఉంటాయంటూ స్పీకర్ తమ్మినేని ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ అభివృద్ధి మరచి నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చుపెడుతున్నారు కదా అన్న ప్రశ్నకు కూడా స్పీకర్ గారికి కోపం తన్నుకొచ్చింది.
రాష్ట్రంలో ఇన్ని పోర్టులు, హార్బర్లు, ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు ఎలా వచ్చాయి? ప్రశ్నించే ముందు విలేకరులకు స్పష్టత ఉండాలి.. అది లేకుంటే చెప్పింది రాసుకుపోవాలి అంటూ ఒకింత వ్యగ్యం జోడించి మరీ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలపై కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం కస్సుబుస్సులాడారు. కొంచెం ఓపిక పట్టండి. కొడితే గూబ గుయ్యిమంటాది. ఇలా అలా కాదు. వీర మహాబాదుడు ఉంటుంది. ప్రజల కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదేం ఖర్మ అని అంటారా వాళ్లు..? ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల అధాకార పార్టీ నాయకులలో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లుంది. ప్రజా సమస్యపై ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడం అటుంచి.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై చేయి చేసుకోవడానికీ వెనుకాడటం లేదు. ఏపీలో అస్తవ్యస్త పాలనపై ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్న నేతలకు భవిష్యత్ భూతద్దంలో కనిపిస్తుండటంతో ఆందోళన, భయంతో ప్రశ్నించే వారిని టార్గెట్ చేసుకుని నోటికీ, చేతికీ పని చేబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-speaker-answer-to-cbi-chief-only-39-155748.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.