అతి విశ్వాసం జగన్ లక్షణమా?

Publish Date:Sep 3, 2023

Advertisement

ఏపీలో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉందని, ఈసారి ఇక్కడ తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పేశాయి. అయినా  తెలుగుదేశం ఏ మాత్రం రిలాక్స్ కాకుండా రెట్టింపు ఉత్సహంతో పనిచేస్తున్నది.

ఆ పార్టీ నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా బలీయమైన నేతలను రంగంలోకి దింపే ప్రణాళికలు రచిస్తున్నారు.  ఇప్పటికే పలు సర్వేల ఆధారంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నది. మరోవైపు ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ.. నాలుగేళ్ళలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలు ఎన్ని విధాలుగా, ఎంతగా నష్టపోయారో వివరిస్తున్నారు.  టీడీపీతో పాటు జనసేన కూడా ఇదే అంశాన్ని సమర్ధవంతంగా ప్రజలలోకి తీసుకు వెడుతోంది. ప్రతిపక్షాల పొత్తుల వ్యవహారం కూడా త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది.

దాదాపుగా ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటుండగా.. అధికార వైసీపీ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. ప్రతిపక్షాలు టార్గెట్ చేసి ఘాటు విమర్శలకు దిగుతున్నా తిప్పికొట్టేందుకు తమ వద్ద సమాధానం లేదన్నట్లుగా సైలంట్ గా ఉండిపోతోంది.   మంత్రుల నుండి ఎమ్మెల్యే వరకూ అంతా సైలెంట్ మోడ్ లోనే ఉంటున్నారు. ఒకవైపు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరగా.. వాటిని అణచివేసే ప్రయత్నం కూడా ఈ పార్టీ అధిష్టానం తూతూ మంత్రంగానే చేస్తున్నది. ఇంకా చెప్పాలంటే అసలు మాకు పోటీనే లేదు.. మా నేతకి సాటే లేదు అన్నట్లు వైసీపీ నేతల తీరు కనిపిస్తున్నది. ద్వితీయ స్థాయి నేత నుండి ఎమ్మెల్యేల వరకూ కొందరికి ఇప్పటికే 2024 సినిమా క్లారిటీ వచ్చినా వారి మాటలను, సూచనలనూ   పార్టీ అధిష్టానం  పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోగా.. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో వైసీపీ పోకడపైనే చర్చ జరుగుతున్నది.

   వైసీపీ ఇలా కూల్ గా ఉండడం చూస్తే ఇది ఓవర్ కాన్ఫిన్స్ అనే భావన పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి జగన్ మళ్ళీ గెలుస్తారన్న పిచ్చి భ్రమల్లో ఉన్న నేతలు కొందరు.. అస‌లు సంగ‌తి మ‌ర‌చి పార్టీ పెద్దలను కూడా అదే మాయలో ఉంచుతున్నారన్న భావన కలుగుతున్నది. పేదలకు డబ్బులు పంచేశాం వాళ్లే మ‌న‌ల్ని గ‌ట్టెక్కిస్తారని ఆ పార్టీ పెద్దలు కూడా సీఎం వద్ద బాకాలు ఊదుతున్నట్లు తెలుస్తున్నది. ఇంటింటికీ మీ డబ్బులు జమ అయ్యాయని వాళ్ళెవరూ మిమ్మల్ని మర్చిపోరని సీఎంను ఆకాశాన్ని ఎత్తేస్తుండడంతో ఆయన ఊహాలోకాల్లో విహరిస్తున్నారనీ, చివరికి పార్టీ నేతల కుమ్ములాటను కూడా సీఎం వద్ద పార్టీకి అనుకూల అంశంగానే ప్రచారం చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే నేతలు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారని.. అదేమీ పెద్ద సమస్య కాదని, తామెళ్లి చిటికెలో వాటిని క్లియర్ చేస్తామని కొందరు బడా నేతలు సీఎం వద్ద చెప్పి మెప్పు పొందుతున్నట్లు చెబుతున్నారు, 

అయితే, ప్రభుత్వం డబ్బులు పంచితే ప్రజలు పార్టీకి ఓటేసే రోజులు పోయాయి. చివరికి పార్టీ సొంత డబ్బులే ఎన్నికలకు ముందు రోజు ఓటర్ల చేతిలో పెట్టినా ఓటు పడుతుందన్న గ్యారంటీ లేదు. అందునా గత ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం ఇచ్చింది లేదని ఇప్పటికే లెక్కలు తేలాయి. దీనికి తోడు పూర్తిగా ప‌థ‌కాలు రాని వాళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.  ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామా అని ఉన్నారు. వైన్ షాపుల వద్ద కాపాలా కాసిన టీచర్లు, నిత్యం బెదిరింపులు అనుభవిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు, కక్ష పూరిత రాజకీయాల పాపం మోస్తున్న పోలీసులు అందరూ ఇలా వారి వంతు అవకాశం కోసం చూస్తున్నారు. జగన్ అంటే నమ్మకం అనుకున్న యువ‌త‌ నిండా మునిగాక ఇప్పడు జగన్ అంటే మోసానికి షర్ట్ ప్యాంట్ వేసిన రూపమేనని మాట్లాడుకుంటున్నారు.

భ‌వ‌న నిర్మాణ కార్మికులు అనుభవించిన ఆకలి బాధలు నేటికీ మర్చిపోలేకపోతున్నారు. మందుబాబులు ప్రతిరోజూ ఒక్కసారైనా సీఎంను తలచుకుని తిట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. కోర్టులో మొట్టికాయలు, ఇంత వరకూ తేలని సొంత బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు, సీఎం సొంత తల్లి, చెల్లిని తరిమేయడం.. ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత లిస్టు. దీంతో ప్రతి వర్గంలోనూ అసంతృప్తి కనిపిస్తున్నది. ఇదేమీ జగన్ కళ్ళకు కనిపించడం లేదంటే చుట్టూ చేరిన నేతలు ఆయన్ను ఏస్థాయిలో భ్రమల్లో ముంచేశారో అర్ధం చేసుకోవచ్చు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.