చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్.. నిజమేనా?

Publish Date:Jun 10, 2024

Advertisement

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స‌రికొత్త చ‌రిత్ర ఆవిష్కృత‌మైంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా ఏపీ ప్ర‌జ‌లు అధికార పార్టీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్లు అరాచ‌క పాల‌నే. అధికార మ‌దం త‌ల‌కెక్కి సీఎం జ‌గ‌న్ తో స‌హా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై, ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన సామాన్య ప్ర‌జ‌ల‌పైనా దాడులు చేశారు. అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు  పంపించారు. దీనికితోడు రాష్ట్రంలో ఐదేళ్ల‌లో ఎక్క‌డా అభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపించ‌లేదు. దీంతో జ‌గ‌న్ పాల‌న‌పై విసుగెత్తిన ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. తెలుగుదుశం కూట‌మికి భారీ మెజార్టీతో విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. చంద్ర‌బాబు సీఎం అయితేనే ఏపీ అభివృద్ధి ప‌థంలో న‌డుస్తుంద‌న్న బలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని చాటారు. స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌జా తీర్పుతో చంద్ర‌బాబు నాయుడు బుధవారం(జూన్ 12న)  ముఖ్య‌మంత్రిగా  ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 సీఎంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ప‌లు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల‌తోపాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు, రాజకీయ ప్రముఖులు హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి కుటుంబ స‌భ్యుడైన జూనియ‌ర్ ఎన్టీఆర్ కు చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందిందా అనే అంశంపై సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఒక‌వేళ ఆహ్వానం అందితే జూనియ‌ర్ ఎన్టీఆర్  చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారా అనే అంశంపైనా ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఏపీలో కూట‌మి ఘ‌న విజ‌యం త‌రువాత జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు.  ప్రియ‌మైన చంద్ర‌బాబు మావ‌య్య‌కి ఈ చారిత్రాత్మ‌క‌మైన విజ‌యాన్ని సాధించినందుకు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. మీ విజ‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థ‌ంలో న‌డిపిస్తుంద‌ని ఆశిస్తున్నానంటూ  ట్వీట్ చేశారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బాల‌కృష్ణ బాబాయి, నారా లోకేశ్‌, భ‌ర‌త్, పురందేశ్వ‌రి అత్త‌కి నా శుభాకాంక్ష‌లు అంటూ  పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్వీట్ కు చంద్ర‌బాబు, నారా లోకేశ్ రిప్లై ఇచ్చారు. అయితే, ఎన్టీఆర్ ట్వీట్ పై తెలుగుదేశంలోని   ఓ వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది.  చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసినప్పుడు, లోకేష్ పై అక్రమ కేసులు బనాయించినప్పుడు స్పందించని జూనియర్ ఎన్టీఆర్‌.. కూట‌మి విజ‌యం త‌రువాత స్పందించ‌డంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశంలోని ఓ వ‌ర్గం, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వార్ న‌డుస్తుంది. 

గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకీ, నందమూరి, నారా ఫ్యామిలీకి జూనియ‌ర్‌ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  వైసీపీకి చెందిన నేత, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో తెలుగుదేశం శ్రేణుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు వంశీ, నానిల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారికి ద‌గ్గ‌రి వ్య‌క్తిగా పేరున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం వంశీ, నానికి వ్య‌తిరేకంగా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఆడ‌వారిపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదంటూ మాత్ర‌మే  ట్వీట్ చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ అనుచ‌రులుగా పేరున్న వంశీ, కొడాలి నానిల‌కు ఎన్టీఆర్ ఎలాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌క‌పోవ‌డంతోపాటు, క‌నీసం వారి పేరు కూడా ఎత్త‌క‌పోవ‌టం తెలుగుదేశం శ్రేణుల‌ను ఆగ్ర‌హానికి గురిచేసింది. దీంతో తెలుగుదేశంలోని ఓ వ‌ర్గం ఎన్టీఆర్ తీరును సోష‌ల్ మీడియాలో త‌ప్పుబ‌డుతూ వ‌స్తున్నది. 

నంద‌మూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ  ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కీల‌క విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఫ్యామిలీ అంటే సంతోషాన్ని పంచుకోవడం కాదు.. బాధను కూడా పంచుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే.. ఈమధ్య ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం లేదు. నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం మానేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. పిలిచినా రావడం లేదు కాబట్టి పిలుస్తారో లేదో   తెలియదని  నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం త‌ర‌పున ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినా ఆయ‌న వ‌చ్చే అవకాశాలు లేవన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది.  తెలుగుదేశం ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి స‌మ‌యంలో స్పందించ‌ని ఎన్టీఆర్‌.. ఇప్పుడు సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అవ‌కాశాలు త‌క్కువ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.