జగన్ మళ్లీ సభకు వచ్చేనా?

Publish Date:Jun 21, 2024

Advertisement

ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం (జూన్ 21) అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ కు అప్పుడు ఆయన పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యులు ఉన్నారు. ఐదేళ్లు గిర్రున తిరిగి ఇప్పుడు  ఆయన కనీసం ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోయి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ తరఫున ఆయనతో సహా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అంటే ఐదేళ్ల జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగా విసిగిపోయారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదన్నదే ప్రజా తీర్పు. ఆ ప్రజా తీర్పును ఎవరైనా సరే గౌరవించి తీరాల్సిందే. అందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా మినహాయింపు లేదు.

ఇక విషయానికి వస్తే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ కు చంద్రబాబు ఆయన కోరిన మీదటే అయినా కొన్ని వెసులు బాట్లు ఇవ్వడం పట్ల ప్రజలలో  ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు కూడా బాబు మరీ అంత మంచితనం ప్రదర్శించకుండా ఉండాల్సిందని అంటున్నారు. ఇంతకీ జగన్ కోరిన మీదట చంద్రబాబు ఆయనకు కల్పించిన వెసులు బాట్లు ఏమిటయ్యా అంటే.. మంత్రులు వచ్చినట్లుగానే జగన్ కూడా తన వాహనంలోనే అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే అవకాశం కల్పించడం, అలాగే ప్రమాణ స్వీకారానికి అక్షర క్రమంలో తన వంతు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా మంత్రుల ప్రమాణ స్వీకారం కాగానే జగన్  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వడం. ఈ వెసులు బాట్లను చంద్రబాబు జగన్ కు కల్పించడంపై తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలలోనే కాదు జనం నుంచి కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జగన్ అసెంబ్లీలోకి ప్రవేశించగానే తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరు వచ్చావా? అంటూ ప్రశ్నించడం, అసెంబ్లీ బయట జగన్ మావయ్యా అంటూ జనం గేలి చేయడం చూసిన తరువాత జగన్ తన అస్తవ్యస్త పాలనతో అందరిలోనూ ఎంతగా వ్యతిరేకత మూటగట్టుకున్నారో అర్ధమౌతుంది. 

ఇక ఆయన హయాంలో అసెంబ్లీ నడిచిన తీరు, ప్రత్యర్థి పార్టీ నేతలను అవమానించిన విధం అందరికీ తెలిసిందే. అంతకు అంతా తిరిగి ఇచ్చేయాలన్న భావిస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు గతం గత: మనం మాత్రం మంచిగానే ఉందామనేలా చంద్రబాబు జగన్ కు వెసులుబాట్లు కల్పించడమేంటన్న ఆవేదన తెలుగుదేశం ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అయితే కొందరు మాత్రం చంద్రబాబు తన పట్ల ప్రదర్శించిన ఉదారత  జగన్ కు చెంపపెట్టులా తగులుతుందని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్ కు అక్కడ నుంచి బయటకు వెళ్లిన జగన్ మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టే సాహసం చేస్తారని అనుకోవడం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రిగా తన ప్రవర్తన ఎంత హేయంగా ఉందో తన హుందాతనంతో చంద్రబాబు జగన్ కు కళ్లకు కట్టేలా చూపించారంటున్నారు.  తొలి రోజే ఓ ఐదు నిముషాలు అసెంబ్లీలో కూర్చోలేకపోయిన జగన్.. ముందు ముందు అసెుంబ్లీలోకి వచ్చి సభా కార్యక్రమాలలో పాల్గొంటారని భావించలేమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.