పార్టీ పేరు మారితే.. భవిత మారుతుందా?

Publish Date:Oct 11, 2022

Advertisement

ఎవరి నమ్మకాలు వారివి. చేతులకు దారాలు కట్టుకుంటే పరీక్షల్లో పాసవుతామని పిల్లలు నమ్ముతారు. పిల్లలే కాదు పెద్దలు కూడా నమ్ముతారు. అలాగే, పేరు మారిస్తే కలిసొస్తుందని నమ్మే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎవరిదాకానో  ఎందుకు కర్ణాటక మాజీ  ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, యడ్యూరప్ప తమ పేరును యడ్యూరప్ప( Yeddyurappa) నుంచి  యెడియూరప్ప(Yediyurappa)గా మార్చుకున్నారు.

అలాగే, న్యూమరాలజీ మీద నమ్మకమున్న మరి కొందరు నాయకులు, సినిమా ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా పేరును, పేరులోని అక్షరాలను అటూ ఇటుగా మార్చుకుని, తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న సందర్భాలు లేక పోలేదు. అయితే అందులో ఎంత మంది అదృష్ట గీతాలు మారాయో మాత్రం మనకు తేలియదు. అయితే ఇప్పుడు వ్యక్తులే కాదు. రాజకీయ పార్టీలు కూడా పేరు మార్చుకుంటే ఫలితం ఉంటుదనే ఆలోచనలు చేస్తున్నాయి. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస) గా మార్చారు. అయితే, తెరాస కలిసిరాని పేరా ? అంటే కానే కాదు. గతంలోనూ  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా ప్రయత్నాలే జరిగాయి. చెన్నా రెడ్డి మొదలు ఇంద్రా రెడ్డి వరకు పార్టీలు పెట్టారు, ఉద్యమాలు నడిపారు.

కానీ సక్సెస్ కాలేక పోయారు. నిజానికి, ఈ అనుభవంతోనే కేసీఆర్ తెరాస స్థాపించినప్పుడు చాలామంది  ‘ఎంతమందిని చూడలేదు, ఈయనా అంతే’ అంటూ పెదవి విరిచారు. తెరాస కూడా పుబ్బలో పుట్టి మఖలో మాయమై పోవడం ఖాయమనే అనుకున్నారు. కానీ  ఏమి జరిగిందో అందరికి తెలిసిందే. తెరాస జెండా నీడనే  తెలంగాణ ప్రజల  60 ఏళ్ల కల నిజమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతే  కాదు, తెరాస జెండా నీడనే కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు ఇలా అయన కుటుంబంలోని ముఖ్యులు పదవులు పొందారు. బంధు, మిత్రుల వ్యాపారాలు వృద్ధి చెందాయి. ఎవరు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించారో లెక్కలు లేవు కానీ, తెరాస జెండా నీడన చాలామంది  అపర కుబేరులయ్యారని అంటారు. వ్యక్తుల విషయం ఎలా ఉన్నా  తెరాసకు దేశంలో ఏ పార్టీకీ లేనంత ఆస్తులు కూడా బెట్టారు. ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్ కొనే స్థాయికి పార్టీ ఎదిగింది. అయినా, జాతీయ రాజకీయాలలో జెండా ఎగరేసే లక్ష్యంతో తెరాస పేరును భారాసగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిలోంచి తెలంగాణని చెరిపేసి, దేశమంతా ఆమోదించే విధంగా ‘భారత’ పదాన్ని చేర్చారు. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారో,  దేశ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారో, చివరకు ఈ పేరు మార్పు ఎలాంటి ఫలితం ఇస్తుందో .. చూడవలసి వుంది.

 అదలా ఉంటే వందేళ్ళు నిండిన భారత జాతీయ కాంగ్రెస్  పేరును మార్చే ఆలోచన ఒకటి ఈ మధ్య కాలంలో తెర మీదకు  వచ్చింది. కాంగ్రస్ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న కేరళ ఎంపీ శశి థ‌రూర్  భారత జాతీయ కాంగ్రెస్ పేరును యువ భార‌త్ కాంగ్రెస్ అంటూ మారిస్తే ఎలా ఉంటుంద‌నే చర్చను తెర మీదకు తెచ్చారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్రకు యువత నుంచి  వస్తున్న స్పందన నేపధ్యంగా ఆయన ఈ ప్రతిపాదన చేశారు. సరే, ఆయన ఈ సమయంలో ఇలాంటి ప్రతిపాదన ఎందుకు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ యువ ఓటర్లు  (నాయకులను) ఆకట్టుకునేందుకే ఆయన, ఈప్రతిపాదన చేశారా? లేక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చిన నేపధ్యంలో, కాంగ్రెస్ ఐడియాలజీ పునాదిగా,యువతకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనతో  థ‌రూర్ ఉన్నారా? అందుకే ఆయన తమ అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు వినిపించేలా గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారా, అంటే, ‘ఎస్’ ఆర్ ‘నో ‘అనే సమాధానం అయితే రావడం లేదు.అయితే, అదెలా ఉన్నా కాంగ్రెస్ పేరు మార్పు చర్చకు అయితే థ‌రూర్ తెర తీశారు. అయితే పేరు మారితే పార్టీ భవిత మారుతుందా? అంటే, ఏమో ... న్యూమరాలజీ , సంఖ్యా శాస్త్రం ఏమి చెపుతుందో ..చూడాలి.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.