ధోని జెర్సీ నెంబరు 7పై ఫ్యాన్స్‌లో టెన్షన్.. టెన్షన్
Publish Date:Mar 20, 2026
Advertisement
ఇండియన్ క్రికెట్లో జెర్సీ నంబర్ 7కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇండియన్ క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా, దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా, మిస్టర్ కూల్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నంబర్ అది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్ మొత్తం మహేంద్రసింగ్ ధోనీ ఏడో నంబర్ జెర్సీతోనే బరిలోకి దిగాడు. దాంతో క్రికెట్ ఫ్యాన్స్‌లో దాన్నే లక్కీ నెంబర్‌గా ఫాలో అవుతుంటారు. అయితే ధోని తాజాగా పేస్ బుక్‌లో పెట్టిన పోస్టుతో అతని జెర్సీ నెంబరు మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ పెట్టిన పోస్టుతో జెర్సీ నెంబర్ 7 నుంచి 8కి మారబోతున్నదా అన్న చర్చ మొదలైంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ, ఐపీఎల్‌లోనూ కూడా ధోనీ 7 నంబర్ జెర్సీతోనే ఆడాడు. అయితే తాజాగా ధోనీ చేసిన ఓ పోస్ట్ అతడి జెర్సీ నంబర్ పై సరికొత్త చర్చకు తెర తీసింది. కొన్ని అంకెలు మనతోనే ఉండిపోతాయి. తనకు నంబర్ 7 అలాంటిది అని పేర్కొన్న ధోనీ.. అయితే తాను ఈ రోజు నంబర్ 8కి మారుతున్నానని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. ఎందుకో మీకు త్వరలోనే తెలుస్తుంది అంటూ ధోనీ చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ గా మారింది. చాలా మంది అభిమానులు ధోనీని 7వ నంబర్ జెర్సీకే కట్టుబడి ఉండాలని కోరుతున్నారు. ధోనీకి, నంబర్ 7కు ఉన్న బంధం కేవలం క్రికెట్‌కు సంబంధించినది మాత్రమే కాదు. ధోనీ పుట్టిన తేదీ జులై 7. అంటే 7వ నెల 7వ తారీకు. అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోనీ ఏడో నంబర్ జెర్సీతోనే ఆడుతున్నాడు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్ 7 జెర్సీని రిటైర్ చేసి, ఆ నెంబరు ఎవరికీ కేటాయించకూడదని నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ధోనీ ఐపీఎల్ కోసం తన లక్కీ నంబర్‌ను మార్చుకోడని పలువురు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/will-dhoni-change-his-jersy-number-36-215803.html





