వైసీపీకి శాశ్వత అధ్యక్షుడెందుకు? విజయమ్మకు ఉద్వాసన ఎందుకు??

Publish Date:Jul 7, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో ఏదో జరుగుతోంది. ఆ పార్టీ అధినేతలో భయం గూడుకట్టుకుందా అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నాయి. లేకపోతే ఉరుములేని మెరుపులా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకునేందుకు జగన్ ఎందుకు అంత తొందరపడుతున్నారు. తనపై తిరుగుబాటు చేసి ఎవరైనా పార్టీ అధ్యక్షపదవిని తన్నుకుపోతారని భావిస్తున్నారా? అన్న అనుమానాలను పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.

లేకపోతే పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తూ పార్టీ ప్లీనరీ వేదికగా ఎందుకు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రెండేళ్లకూ ఒక సారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న పార్టీ బైలాస్ ను ఇప్పటికిప్పుడు ఎందుకు సవరణ చేసి మరీ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించేందుకు తొదర పడుతున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ ప్లీనరీ వేదికగా సమాధానం దొరుకుతుందో లేదో ఇప్పటికైతే తెలియదు కానీ, హడావుడిగా పార్టీ బైలాస్ ను సవరించి మరీ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించేందుకు పడుతున్న తొందర వెనుక ఉన్న కారణం భయమేనని విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో ప్లీనరీ వేదికగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేత రాజీనామా చేయించేందుకు నిర్ణయించడం కూడా ఆమె వలన పార్టీలో చీలిక వస్తుందా అన్న భయమే కనబడుతోందని అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి తానేటి వనితలు పార్టీ బైలాస్సవరణ విషయంలో ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచీ పార్టీ అధ్యక్షుడిగా జగనే కొనసాగుతున్నారు.

పార్టీ నియమావళి మేరకు ప్రతి రెండేళ్లకూ ఓ సారి పార్టీ ఆయననే అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ వస్తోంది. ఆ ఎన్నిక కూడా ఏకగ్రీవమే. పోటీ మాటే లేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ప్రతి రెండేళ్ల కోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమించాల్సిన అత్యవసర పరిస్థితి ఎందుకు వచ్చింది. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను ఆఘమేఘాల మీద తొలగించాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలకు పరిశీలకులు మాత్రం పార్టీలో మారుతున్న పరిస్థితి, పెరుగుతున్న అసంతృప్తే కారణమని అంటున్నారు.

జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలు, శ్రేణులు విజయమ్మను ఆశ్రయిస్తారన్న భయమే ఆమెను పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించాలన్న జగన్ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీలో తిరుగుబాటు భయమే జగన్ ను తనను పార్టీ శాశ్వత అధ్యక్షునిగా నియమించుకునే దిశగా నడిపిందని అంటున్నారు.

ఇటీవల మహారాష్ట్రలో సంభవించిన పరిస్థితుల నేపధ్యంలోనే జగన్ లో ఈ భయం మరింతగా పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర శివసేనలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న ఉద్ధవ్ థాక్రేపై ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి తమదే అసలైన శివసేన అని క్లెయిమ్ చేసుకుంటున్న సంగతి విదితమే. తన ముందస్తు ప్రణాళికలు, పార్టీలో పెరుగుతున్నఅసమ్మతి నేపథ్యంలో జగన్ ముందు జాగ్రత్తగా శాశ్వత అధ్యక్ష పదవిని చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.