ఇంతోటి దానికి అంతోటి రాగ మెందుకో..!

Publish Date:Oct 3, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు, చివరాఖరుకు, జాతీయ రాజకీయాల గురించి ఒక నిర్ణయానికి వచ్చారు. అనేక కోణాల్లో అలోచించి, ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల ముందు మొదలైన ‘జాతీయ’ అలోచనకు చుక్క పెట్టారు. పాత పార్టీకి కొత్త లేబుల్ తగిలించే నామకరణ మహోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజున తెలంగాణకు పర్యాయ పదంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారు చేశారు.

తెలంగాణ ప్రజలు, చివరకు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో విభేదించే వారు కూడా ఇంటి పార్టీగా అక్కున చేర్చుకుని, ఆదరించిన తెరాసను చెరిపేస్తున్నారు. పజల గుండెల్లోంచి తొలిగించేస్తున్నారు.  తెరాస స్థానంలో కొత్త పేరు వచ్చి చేరుతుంది. తెరాస చరిత్ర పుటల్లో చేరిపోతుంది. ఇప్పుడు ఒక  ప్రాతీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీ అధ్యక్షుడు అవుతారు.  కొత్త పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కేటీఆర్, కొలువు తీరతారు.  నిజానికి, కారణాలు ఏవైనా కేసీఆర్ చాలా కాలంగా జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఒక దశలో రాష్ట్ర రాజకీయాలు బోర్ కొడుతున్నాయని కుడా అన్నారు. అందుకే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే  ముఖ్యమంత్రి  జాతీయ రాజకేయాల ఆలోచన చేశారు.  అయితే, ఎందుకనో ఏమో ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమ,(థర్డ్ ఫ్రంట్)గా మొదలైన ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయితే, అలా థర్డ్ ఫ్రంట్ గా మొదలైన ఆలోచన జాతీయ పార్టీ ఏర్పాటు అంచుల దాకా వెళ్లి, యూటర్న్ తీసుకుంది. చివరకు, ప్రాంతీయ పార్టీ (తెరాస) పేరుమార్చి కొత్త పేరు (బీఆర్ఎస్. నవభారత్ పార్టీ) తో జాతీయ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాలనే గమ్యానికి చేరింది.

 అయితే, ఇంతోటి దానికి అంతోటి రాగం ఎందుకని, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి,ప్రాంతీయ పార్టీలుగా పుట్టిన తృణమూల్, ఎన్సీపీ, ఆప్, లాంటి అనేక పార్టీలు జాతీయ హోదా పొందక ముందు నుంచి కూడా ఇతర రాష్ట్రాలలోనూ పోటీ చేస్తున్నాయి. సీట్లు గెలుచుకుంటున్నాయి. తెరాస పుట్టిన దశాబ్ద కాలానికి, అంటే  2011లో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)అయితే, పుట్టిన ఢిల్లీతో పాటుగా, పంజాబ్ లోనూ అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు గుజారత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీకి దిగుతోంది. కానీ, తెరాస మాత్రం ఇంతవరకు తెలంగాణ గడప దాటలేదు. ఇప్పుడే  తొలి అడుగు వేస్తోంది.  అయితే, నిజానికి ముఖ్యమంత్రి కేసేఆర్ మనసులో ఏమున్నా, పైకి చెపుతున్న మాటలను, ఇతర  రాష్ట్రాల ప్రజలు, నాయకులు నమ్మడం లేదు. ఇతర రాష్ట్రాల నాయకులు , ప్రజలే కాదు,  రాష్ట్ర ప్రజలు, చివరకు, సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా విశ్వసించడం లేదు. కేవలం, తెలంగాణలో వీస్తున్న ఎదురు గాలులను తట్టుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ ఎజెండాను భుజానికి ఎత్తుకున్నారన్నది స్పష్టమై పోయిందని  అంటున్నారు. నిజానికి, కేసీఆర్ గతంలోనే  రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకు తమ వ్యూహం  తమకు ఉందని అనేక సందర్భాలలో ప్రకటించారు.  బహుసా అది ఇదే కావచ్చని అంటున్నారు. 

అంతే కాకుండా, దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంటోందని తెరాస నాయకులు ప్రచారం చేసుకోవడమే కానీ  తెరాస ప్రభుత్వం వందల వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి  దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తుకున్నా  ఊరు పేరున్న నాయకులు ఎవరూ కూడా, కేసీఆర్ కు జై కొట్టలేదు. కనీసం చేతులు కలపలేదు. 

నిజానికి  కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని దేశం చుట్టి వచ్చారు. అరడజను మంది వరకు ముఖ్యమంత్రులను, ఇతర పార్టీల పెద్దలను కలిసి వచ్చారు. కానీ, అందులో ఏ ఒక్కరూ కూడా తెలంగాణ మోడల్ అద్భుతంగా ఉందని కితాబు ఇవ్వలేదు. అసలు ఒక సారి కలిసిన వారు ఎవరూ రెండవసారి అయనతో రాజకీయ సంబంధాలు కొనసాగించలేదు. ఒక విధంగా, జాతీయ రాజకేయాల్లో కేసీఆర్ ఒంటరి అయిపోయారనే అభిప్రాయం బలపడింది.

అందుకే, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచను అటకెక్కించారని, ఇతర రాజకీయ పండితులు విశ్లేషించారు. ఆ తర్వాతనే జాతీయ పార్టీ ఆలోచను తెర పైకి తెచ్చారు. అయితే అదీ వర్క్అవుట్ కాలేదు.అందుకే చివరకు ఏ దారి లేకనే  తెరాస పేరును మార్చి పరవు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఇదైనా వర్కౌట్ అవుతుందా అంటే, అవకాశమే లేదని అంటున్నారు. అలాగే జాతీయ రాజకీయాలకు సంబంధించి ఇంతవరకు కేసీఆర్ చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. ఇది కూడా అంతే అంటున్నారు రాజకీయ పండితులు. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.