ఇంత భయమేల జగన్ రెడ్డి?

Publish Date:Oct 8, 2023

Advertisement

సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది.. వెన్ను చూపని ధీరుడు, వెనకడుగు వేయని మొనగాడు.. రాయలసీమ ముద్దుబిడ్డ.. పులివెందుల పులి బిడ్డ.. రాజన్న బిడ్డ, రాయలసీమ రత్నం.. ఇవీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలూ, శ్రేణుల నినాదాలు, ఇచ్చే బిల్డప్ లు. కానీ, ఆయనేమో పోలీసులు లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి  బయటకి రారు. పరదాలు, బారికేడ్లు లేకుండా గేటు దాటరు. రెండు మూడు కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేయడానికి కూడా ధైర్యం చేయరు. అసలు జనాలకు కనిపించకుండా ఆకాశమార్గానే ప్రయాణిస్తున్నారు. ఇక బటన్ నొక్కేందుకు ఆయన పర్యటనను చేసినా.. ఆ పర్యటన మార్గంలో   మార్గంలో మనుషులనే వారు కనిపించకుండా పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆయన పర్యటనకు ఒక రోజు ముందు నుంచే   మల్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసి  ఆయన ప్రజల కంటికి కూడా కనిపించకుండా పరదాలు కట్టేస్తున్నారు. పరదాటు కట్టేందుకు అడ్డం వస్తాయనుకుంటే చెట్లను నరికేస్తున్నారు. జగన్ కనిపిస్తే ప్రజలు దాడి చేస్తారని భయమో లేక ఓటేశాక వాళ్ళతో ఇంకేం అవసరం ఉందిలే అనుకున్నారో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ముఖం చూపించేందుకు కూడా ఇష్టపడటం లేదు. సరే అదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ఏకంగా జగన్ కు, ఆయన కుటుంబానికి ఐదంచెల భద్రత ఏర్పాటు చేసుకుంటున్నారు. 

సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కోసం ఏకంగా చట్టమే తీసుకొచ్చారు. తనకు, తన భార్య, పిల్లలకు, తల్లికి, దేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా అత్యంత సమీపం నుంచి భద్రత కల్పించడానికి స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుని ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఏకంగా ప్రత్యేక చట్టమే తీసుకొచ్చారు. దేశంలో తొలిసారిగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేనివిధంగా ఏపీ సీఎం, ఆయన కుటుంబ భద్రత కోసం ఇలా ప్రత్యేకంగా ఎస్ఎస్జీని ఏర్పా టు చేస్తున్నారు. ఈ చట్టంతో ఇప్పటికే ఉన్న వందలాది మంది సీఎం భద్రతా సిబ్బందితో పాటు జగన్ భద్రత కోసం మరికొంత మంది తోడు కానుండగా.. తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే జగన్ భార్య భారతీకి, హైదరాబాద్ నగరంలో ఉన్న జగన్ తల్లి విజయమ్మకు, ప్రస్తుతం విదేశాల్లో  ఉన్న జగన్ ఇద్దరు కుమార్తెలకు కూడా భద్రత కల్పించనున్నారు. ఎస్ఎస్జీ చట్టం ప్రకారం జగన్ కుమార్తెలకు అక్కడ కూడా భద్రత కల్పించాల్సి ఉంది. 

ఈ ఎస్ఎస్జీ భద్రత గ్రూపు కోసం ఏటా ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించనున్నారు. సీఎం ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లినా, విదేశాలకు వెళ్లినా వీరు తోడుగా ఉంటూ రక్షణ కల్పిస్తారు. సీఎంకు సాధారణంగానే నాలుగైదు అంచెల సెక్యూరిటీ ఉంటుంది. వారికి తోడుగా ఇప్పుడు ఈ ఎస్ఎస్జీ భద్రత కూడా కలవనుంది. ఇలాంటిదే దేశ ప్రధానికి ఉంటుంది. ప్రధాని భద్రత కోసం ప్రత్యేకంగా ఎస్పీజీ ఉంటుంది. అదే స్థాయిలో ఇప్పుడు జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ఎస్ఎస్జీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీని కోసం చట్టం తీసుకురాగా ఇక గవర్నర్ ఆమోదం లభిస్తే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ  వెంటనే ఎస్ఎస్జీ చట్టం అమల్లోకి వస్తుంది.

అయితే, అసలు   సీఎంకు, ఆయన కుటుంబానికి ఇప్పటికిప్పుడు ఈ స్థాయి భద్రత ఏం అవసరం వచ్చిందన్నదే చర్చ. రాష్ట్రంలో మావోయిస్టుల ఊసేలేదని ప్రభుత్వమే కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జగనే స్వయంగా రాష్ట్రంలో మావోయిస్టులను కట్టడి చేశామని చెప్పారు. ఇక ఏపీలో మాఫియా ఉందా అంటే,,  ఉంటే గింటే ఆ మాఫియా వైసీపీ నేతల అండదండలతోనే సాగుతున్నది కనుక దాంతో ప్రజలకే తప్ప సీఎంకు వచ్చిన నష్టం లేదు. పోనీ తెలుగుదేశం నుండి   థ్రెట్ ఉందా అంటే..  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బయటకొచ్చిన కార్యకర్తలను కూడా పోలీసులు లోపలేసి కేసులు పెడుతున్న పరిస్థితి.  మరి ఇప్పటికిప్పుడు ఏడాదికి రూ.ఐదు వందల కోట్ల ఖర్చు పెట్టి ఈ ప్రత్యేక భద్రత ఎందుకు తీసుకొచ్చారన్నది ఆ జగన్మోహనరెడ్డికే తెలియాలి.   హక్కుల్ని కాలరాస్తూ, అణచివేత, అరాచకాలు, ప్రతీకారం, రాజకీయ కక్ష సాధింపు పాలన చేస్తున్న జగన్ రెడ్డి తన నీడను చూసి తానే భయపడుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.