కాంగ్రెస్ ఆఫర్ పీకే ఎందుకు కాదన్నారు?

Publish Date:Apr 28, 2022

Advertisement

పీటల దాక వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే, అందుకు పెద్ద కారణమే ఉండి ఉంటుంది, లేదంటే అందాక వచ్చిన పెళ్లి ఆగిపోదు.అందుకే,కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు గడపదాకా వచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎందుకు వెనక్కి వెళ్లారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీకే వెనక్కి వెళ్ళిపోవడం వెనక కూడా చాలా పెద్ద కారణమే ఉండి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి, పీకే కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తాలు వచ్చిన నేపధ్యంలో హస్తం పార్టీలో కొంత ఉత్సాహం కనిపించింది. కొంతవరకు అయినా కష్టాలు తీరినట్లే అనే ఆశలు చిగురించాయి. అలాగే, ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో మంతనాలు జరపడంతో హస్తవాసి మారుతుందన్న ఆశలూ బలపడ్డాయి.  పార్టీ నాయకులు,కార్యకర్తలతో పాటుగా సామాన్య ప్రజలు కూడా కాంగ్రెస్  పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల ఆసక్తి చూపించారు. మీడియాలో విస్తృతంగా చర్చలు జరిగాయి. పీకే ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయన్న చర్చ జోరుగా సాగింది. పీకేకున్న ట్రాక్ రికార్డు కారణంగా కావచ్చును ఆయన మూలంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మెరుగుపడుతుందనే ఆశ ఆ పార్టీ వాదుల్లో తొణికిసలాడింది. అయితే చివరకు పీకే, గడపదాకా వచ్చి గుడ్ బై’ చెప్పి వెళ్ళిపోయారు. 

ఈనేపధ్యంలో, ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. పీకే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు? అంతలోనే ఎందుకు కాదనుకున్నారు? అనే చర్చ ఇప్పుడు అదే స్థాయిలో జరుగుతోంది. అయితే, కర్ణుడి చావుకు లాగా., పీకే  ఫీచేముడ్’కు   కూడా అనేక కారణాలు   ఉన్నాయని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ కోరుకున్న పోజిషన్  ఇచ్చేందుకు  కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదని, అందుకే ఆయన పార్టీలో చేరేందుకు నిరాకరించారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అదొక్కటే కారణమా, అంటే కాదుట, ఇంకా చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. 

అందులో, ఒకటి  ప్రియాంక ఫాక్టర్. కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకు ఇవ్వాలని పీకే చేసిన సూచన, అందరి సంగతి ఎలా ఉన్నా. సోనియా గాంధీకే రుచించలేదని, ఏదో విధంగా  రాహుల్ గాంధీకి పార్టీని అప్పగించాలని, అందుకోసమే ఆమె పీకే పార్టీలోకి ఆహ్వానించారని అయితే, పీకే కూడా రాహుల్ కంటే ప్రియాంక బెస్ట్ ఛాయిస్ అవుతారని సూచించడమే కాకుండా, ప్రధాని అభ్యర్దిగానూ రాహుల్ గాంధీ కాకుండా వేరొకరిని ప్రతిపాదించాలని సూచించారని అంటున్నారు. అయితే, ప్రియాంకకు పగ్గాలు అప్పగించడం సోనియా ఇష్టం లేదని అందుకే ఆమె, కావాలనే పీకేను పోమ్మనకుండానే పంపించారని అంటున్నారు. 

అదలా ఉంటే, ఇప్పుడు తాజాగా, పార్టీ పగ్గాలు టం చేయి దాటకుండా చూసుకునేందుకు సోనియా గాంధీ కొత్తగా పార్టీ సీనియర్ నాయకుడు, సోనియా నమ్మినబంటు, ఏకే ఆంటోనీ తెర మీదకు వచ్చారు. నెహ్రూ-గాంధీ కుటుంబం కాంగ్రెస్‌కు మార్గదర్శనం చేసే శక్తి అని పేర్కొన్నారు. ఆ కుటుంబీకులు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో 99 శాతం మందికి ఆ పార్టీ ఆమోదయోగ్యం కాదన్నారు. అంటే, నాయకత్వ మార్పుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని మరోమారు స్పష్టమైందని అంటున్నారు. ఈ నేఅప్ధ్యంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందనేడి కాలమే నిర్ణయించవలసి ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.