గోషామహల్, నాంపల్లి అభ్యర్థులు ఎందుకు పెండింగ్ ?

Publish Date:Aug 22, 2023

Advertisement

కేసీఆర్ మొదటి జాబితాలో  పెండింగ్ లో పెట్టిన నాలుగు స్థానాల్లో రెండు అసెంబ్లీ హైద్రాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఒకటి గోషామహల్ అయితే రెండోది నాంపల్లి. గోషామహల్ అసెంబ్లీ స్థానానికి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిద్యం వహిస్తుండగా నాంపల్లి నియోజక వర్గానికి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రాతినిద్యం వహిస్తున్నారు. 
ప్రస్తుతం రాజాసింగ్ బిజెపి నుంచి బహిష్కృతులయ్యారు. ఈ సారి ఆయన రాజకీయ భవితవ్యం ఇంకా తేల లేదు. తాను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవచ్చని రాజాసింగ్ ఇప్పటికే ప్రకటించారు. బిజెపి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. సిట్టింగ్ బిజెపి స్థానాన్ని బిఆర్ఎస్ వదులుకోబోతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. 2018లో ఈ స్థానం నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి రాజా సింగ్ చేతిలో పరాజయం చెందారు. అంతకుముందు ప్రేమ్ సింగ్ రాథోడ్ బిజెపి నుంచి మహరాజ్ గంజ్   ఎమ్మెల్యేగా గెలిచారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యధికంగా ఉన్నారు.  ఉత్తరాది అభ్యర్థిని రంగంలో దించాలని బిఆర్ఎస్ భావిస్తోంది. తన ఓటమి తర్వాత గోషామహల్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా కొనసాగిన రాథోడ్ ప్రస్తుతం తప్పుకున్నారు.టిక్కెట్ కోసం కూడా ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. అయితే బిఆర్ఎస్ నుంచి మరో నేత నందకిషోర్ పేరు గోషామహల్ అభ్యర్థి అని వినిపిస్తుంది. బిజెపి బీ టీం అని నింద ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ అభ్యర్థి గోషామహల్ నుంచి బలహీన అభ్యర్థిని రంగంలో దించవచ్చన్న టాక్ ఉంది. 
కాగా నాంపల్లి స్థానానికి ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ మిత్ర పక్షం అని ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీలతో మిత్ర ధర్మం నెరవేర్చని కేసీఆర్ మజ్లిస్ తో  మిత్ర ధర్మం పాటించవచ్చు అని పరిశీలకులు అంటున్నారు. కాని పైకి మాత్రం వెల్లడించకపోవచ్చు. 

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.