మోదీజీ మాట్లాడరేం?

Publish Date:Sep 18, 2023

Advertisement

విషయం, సందర్భం వేరు కావచ్చు, కానీ, సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు,  ఆంధ్ర ప్రదేశ్లో ఏమి జరుగుతోందో మాకు తెలుసు అంటూ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలన , సాగుతున్న కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులకు అద్దం పడుతున్నాయి. అవును, ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీకోర్టు న్యాయమూర్తులు ఏపీలో ఏం జరుగుతోందో మాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.   అంటే, ఏపీలో ఏమి జరుగుతోందో సుప్రీం కోర్టులు తెలుసు. అయినా  నాలుగున్నరేళ్ళ వైసీపీ అరాచక పాలనకు పరాకాష్టగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వ్యవహరం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వం గీత దాటి ప్రవర్తిస్తున్నప్పుడు  కేంద్ర ప్రభుత్వం  జోక్యం చేసుకోవలసిన అవసరం లేదా? చంద్రబాబు అక్రమ అరెస్టు  విషయంలో, ముఖ్యంగా అరెస్ట్ తీరును, ఉభయ తెలుగు రాష్ర్టాల బీజేపీ  నాయకులు సహా పలువురు రాజకీయేతర రంగాల   ప్రముఖులు, ఖండించారు. ఖండిస్తున్నారు. కేవలం ఖండించడమే కాకుండా, దేశ,విదేశాల్లో చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా యువత, ఐటీ ఉద్యోగులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. రోజు రోజుకు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు. ఎందుకు కళ్ళు తెరవదు? ఇది రాష్ట్ర ప్రజానీకాన్ని వేధిస్తున్న ప్రశ్న.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు ...  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా తెలుగు దేశం ముఖ్య నేతలు అందరినీ అరెస్ట్ చేస్తామని మంత్రులు బహిరంగంగానే బెదిరింపులకు దిగడం ఏమిటని? ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా   కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదని  నిలదీస్తున్నారు. మధన పడుతున్నారు. ఈ నేపథ్యంలో  ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు అందరి వేదనకు అద్దం పడుతూ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.

ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. మీకు తెలియకుండానే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో..  మీరు జీ20 శిఖరాగ్ర సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా.. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది  అని కేఎస్ రామారావు పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. కానీ  రాష్ట్ర పౌరుడిగా, భారత పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయానని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక  భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారు. శంకుస్థాపనకు ప్రధాని హోదాలో మీరూ వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు విజన్ ను పొగిడారు. అమరావతి ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజధాని అవుతుందని అన్నారని కేఎస్ రామారావు ఆ లేఖలో గుర్తు చేశారు.  

ఆ తర్వాత 16 నెలలు జైల్లో గడిపి, ఆర్థిక మోసాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా  ప్రజావేదిక కూల్చివేతతో   విధ్వంసక పాలన ఆరంభించారు,  అమరావతిని రాజధానిగా ఉండనివ్వకూడదని ప్రకటించి.. మూడు రాజధానులంటూ ఒక పల్లవి ఎత్తుకుని.. అమరావతిని నిర్వీర్యం చేసేశారు. ప్రధానిగా మీరు  (మోడీ) శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో జగన్ తీరును మీరు ఇప్పటికీ ఖండించలేదు.  మౌనాన్ని ఆశ్రయించారు. అలాగే దేశంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు వల్లే ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా మంచి జీవితాలు అనుభవిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులను చంద్రబాబు అరెస్ట్ వార్త కుదిపేసింది. రోడ్ల మీదకు వచ్చి వారు తెలిపిన నిరసనను.. ప్రధానమంత్రిగా మీరు గమనించలేదా అని ప్రశ్నించారు.

నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీ రామారావు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేసిన కృషి ఏమిటో మీకు తెలియదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెడుతుంటే.. తెలుగు ప్రజల హృదయాల్లో రగులుతున్న బడబాగ్నిని మీరెందుకు గమనించలేకపోతున్నారు. లేక రాజకీయ లబ్ధి వినా ప్రధానిగా మీరింకే విషయాన్నీ పట్టించుకోరా అని నిలదీశారు.  ఇప్పటికైనా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించండి అని కేఎస్ రామారావు తన లేఖలో  ప్రధానిని కోరారు. అంతేగాక, ప్రధానమంత్రిగా మీకున్న అధికారంతో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగేవరకూ రాష్ట్రపతి పాలన విధించండి. ఆ చర్యతో తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. తక్షణం స్పందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి అని తన లేఖలో ప్రధాని మోడీని కేఎస్ రామారావు కోరారు. 

 నిజానికి, సినీ నిర్మాత కేఎస్ రామారావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై ఆయన సంతకం ఒక్కటే ఉన్నా ..  అది ఐదు కోట్ల ఆంధ్రుల సంతకమేనని చెప్పాలి. ఐదు కోట్ల ఆంధ్రుల హృదయస్పందనకు కేఎస్ రామారావు లేఖను దర్పణంగా చూడాలి. నిజానికి కేఎస్ రామారావు సంతకం చేసిన లేఖ ఆంధ్రులు, ఇరుగు పొరుగు రాష్ట్రాల తెలుగు వారిదే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి  హస్తాక్షరి ... ఆ ఒక్క సంతకం.  అందుకే  ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో  జోక్యం చేసుకోవలసిన అవసరం వుంది , ప్రాజస్వామ్యం మరింత పలచనై, ప్రజల విశ్వాసాన్ని మరింతగా కోల్పోతుందని, ప్రజస్వామ్య పరిరక్షణ వేదికలు హెచ్చరిస్తున్నాయి. 

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.