జబ్జార్ భాయ్ బ్యాంకు ఉద్యోగిగా రిటైరయ్యారు. పెన్షన్ తప్పితే మరో ఆదాయ మార్గం లేకపోవడంతో నిరాశ, నిస్పృహ ఆవహించింది. నెలకు లక్ష రూపాయల జీతం రాకపోవడమే ఆయన నిస్పృహకు కారణమైంది.
ఒక రోజు మౌలానా తారసపడ్డాడు.
మౌలానా: జబ్జార్ భాయ్ మునుపటి మాదిరిగా ఉత్సాహంగా లేకపోవడాన్ని మౌలానా పసిగట్టాడు. ఏమయ్యింది , జబ్బార్ భాయ్ అలా ఉన్నావు అని అడిగాడు.
జబ్బార్ భాయ్: సలాం వాలేకుం మౌలానాసాబ్. నేను 40 ఏళ్లు ఉద్యోగం చేసి రెండు ఇళ్లు , పిల్లల పెళ్లిళ్లు చేశాను. ఇటీవల రిటైరయ్యాను. పిల్లలకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. సంపాదించే నేను రిటైరయ్యాను. పెన్షన్ తప్పితే మరో మార్గం లేదు. మనవడు, మనవరాళ్లను ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించాలంటే డబ్బు లేదు మౌలానా సాబ్
మౌలానా: నేను ఇస్లాం అమలుకు సంబంధించి వేలాది తక్రీర్ ( ప్రవచనం)లు ఇచ్చాను. వాటిని అమలు చేసే వారు కరువయ్యారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం నేను ఇచ్చిన తక్రీర్ లను మనుషులు అమలు చేసే వారు. ఇప్పుడలా లేదు. డబ్బు ఎక్కువైతే చాలామంది బుర్ర చెడిపోతుంది. డబ్బున్నవాడు పేదవాడిని అవమానపరుస్తాడు. అహంకారం ఎక్కువైతే మనుషులను వేధించడం ప్రారంభిస్తారు. బేవకూఫ్ హై, పాగల్ హై అని నానా బూతులు తిడుతుంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నా పేదవాడు తరతరాలుగా అవమానానికి గురవుతున్నాడు. సమాజంలో ట్రెండ్ నడుస్తుంది. ఖురాన్ మీద విశ్వాసం లేకపోవడమే మనిషి నిరాశకు ప్రధాన కారణం. లాయ్ లా ఇల్లాల్లా మహమ్మదుర్ రసూలుల్లా అని అరబ్బీలో మహమ్మద్ ప్రవక్త ప్రవచించారు. అల్లా తప్పితే మరో దేవుడు సృష్టిలో లేడని ప్రవక్త సందేశం ఇచ్చారు. అల్లా మీద నమ్మకం లేనివారు ఇలా డిప్రెస్ అవుతారు. సంపద పెరిగితే తృప్తి పడరు. ఇం కా కావాలి కావాలి అంటారు.
నబీ ఎప్పుడు తప్పుడు ప్రవచనం ఇవ్వడు కదా. మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం.
ఎండాకాలంలో మా చిన్నప్పుడు చేతి విసనకర్రతో ఉక్కపోతతో ఉపశమనం పొందే వాళ్లం. పవర్ జనరేట్ అయ్యాక ఇళ్లలోకి కరెంట్ సప్లయ్ అయ్యింది. అప్పుడు ఫ్యాన్లతో సరిపెట్టుకున్నాం. జనాల దగ్గర డబ్బు ఎక్కువైతే విలాసవస్తువులపై మనసు పడుతుంది. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఎయిర్ కూలర్ల స్థానే ఎయిర్ కండిషన్ల ను కొనుగోలు చేస్తున్నారు. మన చెప్పులను స్థూల కాయులు ఒకసారి వేసుకుంటే ఆ చెప్పులు మళ్లీ మనకు వదులవుతాయి. మన తలకు సరిపడే హెల్మెట్ ను పెద్ద తల కాయ ఉన్న వ్యక్తి పెట్టుకుంటే ఆ హెల్మెట్ కూడా వదులవుతుంది. మనిషి కోర్కెలు పెరిగితే అవి తీరవు . అప్పుడు మనిషి డిప్రెషన్ కు లోనవుతాడు. డబ్బున్న వ్యక్తులను చూసి మనకూ లేదని మనలో విద్వేషం పెరుగుతుంది. నాకు అంత డబ్బు లేదు అని బాధపడొద్దు. కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులకు అరుగుదల తగ్గిపోతుంది. అరుగుదల ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ధనికుడి కంటే పేదవాడు కంటినిండా నిద్రపోతాడు. డబ్బులెక్కువైన వ్యక్తి నిద్రమాత్రలు వేసుకుంటేనే కంటినిండా నిద్రపోతాడు.40 ఏళ్లు కష్టపడ్డా క్యారెక్టర్ లోపిస్తే అన్నీ పోయినట్టే. క్యారెక్టర్ పెంచుకునే యత్నం చేయాలి. అందం పోయినా పర్వాలేదు కాని మన వ్యక్తిత్వం పోకుండా జాగ్రత్తపడాలి. పైసా హాత్ కా మైలా హై. ఇల్మ్ నహీతో సబ్ కుచ్ చీన్ లేగా అల్లా
-బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-can-t-you-become-rich-even-if-you-work-hard-25-186221.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.