సీఎస్ పదవీ కాలం పొడిగింపు లేనట్లే కొత్త సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్?

Publish Date:Jun 21, 2021

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్‌ పదవీ కాలం జూన్ నెలాఖరుకు ముగుస్తుంది. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కనీసం మరో ఆరు నెలల వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు సుముఖంగా ఉన్నారు. అయన సుముఖంగా ఉండడమే కాదు, అందుకు కేంద్రాన్ని ఒప్పించేందుకు ఆయన తమ పలుకుబడిని వినియోగించారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ,  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల వద్ద సీఎస్ పదవీ కాలం పొడిగింపు ప్రస్తావన చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కారణాలు ఏవైనా, సీఎం అభ్యర్ధనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా కూడా వార్తలొచ్చాయి. ముందు మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు మొత్తం ఆరు నెలలు పొడిగింపు ఉంటుందని, అధికార వర్గాలను ఉతంగిస్తూ వార్త లొచ్చాయి. 

అయితే తాజా సమాచారం ప్రకారం, ఆదిత్యనాధ్ దాస్‌కు, పొడిగింపు ఇవ్వకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధానంగా రెండుకారణాలు చెపుతున్నారు. అందులో, మొదటి కారణం, ‘దేవుడు వరమించిన పూజారి కరుణించలేదు’ అన్నట్లుగా ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు ముఖ్యమత్రికి ఇష్టం (అవసరం) అయినా, ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పే ఒక అస్మదీయ అధికారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే, ఆయన చాకచక్యంగా సిఎస్ పదవీ కాలం ఫైల్’ను పక్కదారి పట్టించి, సకాలంలో ముఖ్యమంత్రి టేబుల్ మీదకు రాకుండా చక్రం తిప్పారు. చివరకు ఆయన ఆశించిన విధంగానే సీఎస్ పదవీ కాలం పొడిగింపు అభ్యర్ధన లేఖ కేంద్రానికి  ఆలస్యంగా చేరింది. దీంతో ఆదిత్యానాథ్ పదవీకాలం పొడిగింపు అంశం సాంకేతిక చిక్కుల్లో చిక్కుకు పోయిందని, ఈ కారణంగా పొడిగింపు ఉండక పోవచ్చని అధికారులు చెపుతున్నారు. 

అదలా ఉంటే  కొద్ది రేజుల క్రితం తెలుగు దేశం పార్టీ రాజ్య సభ సభ్యుడు కనకమేడల రవీందర్ కూడా, సీఎస్’కు  సర్వీసు పొడిగింపు ఇవ్వవద్దని కోరుతూ డిఓపిటికి లేఖ రాశారు. అయన తమ లేఖలో అధిత్యనాద్ దాస్’కు జగన్ అక్రమాస్తుల కేసులతో ఉన్న లింకులను ప్రస్తావించారు. “2013, జగన్ రెడ్డిపై సేబేఐ నమోదు చేసిన  క్విట్ ప్రో కో కేసులో ఆదిత్యానాథ్ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కున్నారు. జలవనరులశాఖ కార్యదర్శిగా, జగనమోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్’కు నీటిని కేటాయించడంలో అధికార పరిధిని అతిక్రమించి అనవసర సహాయ, సహాకారాలు అందిచారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా అదిత్యానాథ్ పై కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలపై, సీబీఐ అనేక సెక్షన్ల  కింద కేసు నమోదు చేసింది. 2019 సెప్టెంబర్’లో ఆకేసులకు సంబంధించి సుప్రీం కోర్టు తిరిగి నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారి పదవీ కాలం పొడిగించడం సరికాదు” అని కనకమేడల తమ  లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్య అధికారి ప్లే చేసిన ట్రిక్ పనిచేసిందో లేక కనకమేడల రాసిన లేఖ ప్రభావం చూపిందో గానీ, మొత్తానికి ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు అవకాశాలు అటకెక్కాయి.  అందుకు అవకాశమే లేదని, అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపధ్యంలో,  ఏపీ కొత్త సీఎస్ ఎంపికకు రేస్ మొదలైనట్లు  చెపుతున్నారు. ఈ రేసులో ప్రస్తుత సమాచారం మేరకు, సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ ముందున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 1986 బ్యాచ్‌కి చెందిన సతీష్‌చంద్ర, 1987 బ్యాచ్‌కే చెందిన మరో సీనియర్ ఐఏఎస్ జెఎస్వీ ప్రసాద్, 88 బ్యాచ్‌కు చెందిన గిరిధర్, పూనం మానకొండయ్య రేసులో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న గిరిధర్, రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా లేరంటున్నారు. ఇక ముక్కసూటి అధికారిగా పేరున్న జేస్వీ ప్రసాద్‌ను తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు సుముఖంగా లేరని చెబుతున్నారు. సతీష్‌చంద్ర గత సీఎం చంద్రబాబు పేషీలో కీలకపాత్రపోషించినందున, ఆయనకు అవకాశాలు ఉండకపోవచ్చంటున్నారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఏమంటే, ప్రస్తుత సీఎస్ పదవీ కాలం పొడిగింపుకు చక్రం అడ్డువేసిన సీఎంఓ కీలక అధికారే, సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ఎంపికలోనూ చక్రం తిప్పారని అధికారవర్గాల సమాచారం. ఈ ఉదంతం నిజమైతే, సీఎం, సీఎస్ కంటే సీఎంఓలో చక్రం తిప్పే రింగ్ మాస్టర్’ కే పవర్ ఎక్కువని మరోసారి రుజువైనట్లవుతుంది. 

కాగా, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, 2000 సంవత్సరం డిసెంబర్ 31న  పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్, 2021 జనవరి 1 న పదవీ బాధ్యతలు చెప్పట్టారు. ఆరు నెలలోనే పదవీ విరమణ చేస్తున్నారు

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.