కేసీఆర్‌ కేండిడేట్ ఎవ‌రు? హుజురాబాద్ అభ్య‌ర్థి ఆయ‌నేనా?

Publish Date:Jul 4, 2021

Advertisement

అన్ని పార్టీలు, మరీ ముఖ్యంగా అధికార తెరాస, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్ధి ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తోంది. ఈస్థానం  నుంచి వరసగా గెలుస్తూ వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన ఈటల ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగాపోటీ చేసిన కౌశిక్ రెడ్డికే మళ్ళీ పార్టీ టికెట్ లభించే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అయితే, టీపీసీసీ పగ్గాలు చేతుల మారిన నేపధ్యంలో, పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 

కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీ ఇచ్చారు. ఈటలకు, ఒక లక్షా 4 వేల 840 (59.34 శాతం) ఓట్లు వస్తే, కౌశిక్ రెడ్డికి 61 వేల 121 (35 శాతం) ఓట్లు వచ్చాయి. ఈటల 43,719 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ద్విముఖ పోటీలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేసిన ఈటలకు గట్టి పోటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డి  రేపటి త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీకి మంచి అభ్యర్ధి అవుతారు. ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే, రాజకీయ లెక్కలు, ఎప్పుడు ఒకలా ఉండవు. అన్ని సందర్భాలలో వన్ ప్లస్ వన్ రెండు కాదు, అలాగే, వన్ బై టూ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు. ఎన్నికల ఇష్యూస్ ‘ను బట్టి ఓటింగ్ సరళీ, స్వభావం మారుతూ ఉంటుంది . ఓటర్ల ప్రాధాన్యతలు  మారుతూ ఉంటాయి. అందుకే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రత్యేకంగా ఉంటుంది. ఫలితాలు అంతే ..   

అదలా ఉంటే, కౌశిక్ రెడ్డికి మాజీ పీసీసీ చీఫ్’తో ఉన్న చుట్టరికం, అలాగే, ఇటీవల ఓ వేడుకల్లో ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్’ను కలవడంతో ఆయన టికెట్ చుట్టూ అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. నిజానికి కౌశిక్ రెడ్డి, మంత్రి కేటీఆర్’ను  ఉద్దేసపూర్వకంగానే కలిశారో లేక యాదృచ్చికంగా అలా జరిగిందో ఏమో గానీ,ఆయన తెరాసలో చేరుతున్నారు, హుజూరాబాద్ నుంచి తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తారు అనే పుకార్లు వినిపించాయి. దీంతో, ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు.నిజానికి ఒక దశలో కౌశిక్ రెడ్డి కూడా గోడదూకే ఆలోచన చేసినట్లు సమాచారం. అయితే, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన ఆలోచన మారింది. అందుకే, ఆయన రేవంత్’నుకలిసి తమ మనసులోని మాటను అయన ముందు ఉంచినట్లు వార్తలొచ్చాయి. నిజానికి, ఇప్పడు పరిస్థితులో ఉప ఎన్నికల్లో గెలుపు కంటే, గెలిచిన ఎమ్మెల్యే చేజారి పోకుండా చూసుకోవడం పీసీసి అధ్యక్షుడి  ముందున్న, ప్రధాన సవాల్’గా పార్టీ  వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్  మీద గెలిచిన 19 మందోలో 12 మంది పార్టీకి జెల్లకొట్టి కారెక్కి తుర్రుమన్నారు. కాబట్టి, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పొడ కూడా గిట్టని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్’ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక అసలు విషయంలోకి వస్తే, అధికార తెరాసకు అభ్యర్ధి దొరకడం లేదని అంటున్నారు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు పోసీ, సొంత పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను కొనుకున్నారన్న  అపవాదును/అవమానాన్ని మోస్తున్న తెరాస, ఈటలకు ధీటుగా నిలిచే సామర్ధ్యం కోసం దిక్కులు చూడవలసి రావడం మరింత అవమానకరంగా మారిందని అంటున్నారు. అయితే, వ్యూహాత్మకంగా దుగులు వేయడంలో ఆయనకు ఆయనే పోటీగా నిలిచే కేసీఆర్, ఎలాంటి వ్యూహంలో ఉన్నారో ఎవరికీ   తెలియదని అంటున్నారు. ఇటీవల జరిగిన హైదరబాద్ –రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో, చివరి  వరకు మౌనంగా ఉంటూ వచ్చిన కేసీఆర్ ఆఖరి క్షణంలో పీవీ కుమార్తె వాణీ కుమారిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ప్రత్యర్ధులను చిత్తు చేశారు. ఇప్పడు కూడా అదే వ్యూహంతో ఉన్నారని, ఎవరూ ఉహించని బ్లాక్ హార్స్, పార్టీ అభ్యర్ధి అయినా ఆశ్చర్య పోనవసరం లేదని పార్టీ వర్గాల్లోనే  కాదు, తెలంగాణ భవన్ వేలుపుల రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. 

అయితే, ప్రస్తుతానికి అయితే, మాజీ ఎంపీ వినోద్ మొదలు మంత్రి హరీష్ వరకు చాలా  మంది పేర్లే షికారు చేస్తున్నాయి. అలాగే, సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈటలకు సొంత ముదిరాజ్ వర్గంతో పాటుగా, రెడ్డి సామాజిక వర్గం (ఆయన భార్య రెడ్డి సామాజిక  వర్గానికి చెందినా వారు), అగ్ర కులాలు ( బీజేపీ అనుకూల ఓటు) కాకుండా .. ఇతర సామాజిక వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని కేసీఆర్ బరిలో డింప వచ్చని  అంటున్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో, అంత వరకు  కూరలో కరివేపాకులా  పక్కన పెట్టిన కడియం ఇంటికి వెళ్లి విందు ఆరగించడం, అలాగే, ఎస్సీ సాధికారిత  పేరున, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలలోని ఎస్సీ నేతలను దగ్గర చేయడం, ఎస్సీ సాధికారిత ప్రకటన.. ఈ వ్యూహ రచనలో భాగమేనా అన్న మాట కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ఈమధ్య కాలంలో ప్రభుత్వం దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. దళితులకు ప్రత్యేక నిధుల కేటాయింపు మొదలుకొని ఇటీవల దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ విషయంలో సీఎం స్పందన, ఇతర పరిణామాలు హుజూరాబాద్‌లో కొత్త రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని రేపుతోంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం సీనియర్‌ నేత, దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి సతీమణి ముద్దసాని మాలతి పేరు ప్రముఖంగా వినవస్తోంది. అయితే, చివరకు, అందరి ఉహాలను తల్లకిందులు చేయడం, కేసీఆర్  మార్క్ రాజకీయం. సో.. చివరకు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు  అన్నట్లుగా హరీష్ రావు అయినా పార్టీ అభ్యర్ధి కావచ్చునని అంటున్నారు. ఏమో.. కేసీఆర్ మనసులో ఏముందో.. ఆయనకే తెలియదు. సో .. ఏదైనా జరగ వచ్చును.
 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.