ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం?

Publish Date:Oct 19, 2022

Advertisement

 వైఈసార్ టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్త పరిచారు. పక్క రాష్ట్రం ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే,ఇప్పడు అదొక రకంగా ముగిసన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిటి పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె బాటలో ఆమె రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న, షర్మిల ఎవరు విసిరిన బాణం అనే ప్రశ్న మళ్ళీ తెరమీదకు వచ్చింది. అలాగే, ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె రియల్  టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  
నిజానికి ఆమె వెంట ఎవరన్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు వీకరించినప్పటి నుంచి ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు.అంతే కాదు, రాష్ట్రంలో కాలు పెట్టింది మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్,కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్’ ఇలా రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే, షర్మిల తెరాస ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో, ప్రధాని మోడీ బట్టలు ఊదదీసి నడిబజార్లో నిలబెదతామని అంటున్నారు. కానీ షర్మిల తెరాస ప్రభుత్వం, బట్టలు రోజు విప్పుతూనే ఉన్నారు. 
అదలా ఉంటే, మహా ప్రస్థానం  పాద యత్ర నుంచి ఆమె ఓ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళారు. రహస్యంగా ఎవరిని కలిశారో ఏమో కానీ, ప్రత్యక్షంగా మాత్రం, సీబీఐ డైరెక్టర్’ ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డినిపైన అవినీతి పైనా ఆరోపణలు చేశారు .ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక లక్ష 20 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐకి ఫిర్యాదు చేశారు. అలాగే, మిషన్ భగీరథ సహా తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు అన్నిట్లోనూ అవినీతి ప్రవహించిందని, ఆన్నిటి పైనా, సిబిఐ విచారణ కోరినట్లు చెప్పారు. 
నిజానికి, ఆమె ఇప్పడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కొత్తగా చెప్పిన విషయమంటూ ఏదీ లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాళేశ్వరం అవినీతి గిరించి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఇదరినీ మించి మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి, ఎకంగా ఒక బృహత్ గ్రంధానికి సరిపడినంత సమాచారాన్ని మీడియా ముందుంచారు.అసలు  ఎవరి దాకానో ఎందుకు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అంతటివాడు, కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఇంతవరకు ఏమీ జరగలేదనుకోండి, అది వేరే విషయం. అలాంటప్పుడు షర్మిల ఇంత హటాత్తుగా సాగుతున్న పాదయాత్రకు బ్రేక్ చెప్పి మరీ ఢిల్లీ ఎందుకెళ్ళారు? సిబిఐకి ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ, ఆమె టార్గెట్ చేసింది ఎవరిని? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 
షర్మిల సిబిఐకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం పైనే అయినా, ఆమె టార్గెట్ మాత్రం, బ్రదర్ జగన్ రెడ్డి అనే అనుమానాలు ఇటు తెలంగాణ, అటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్’లో కొంచెం గట్టిగానే వినవస్తున్నాయి. అందుకే, జగన్ రెడ్డికి అత్యంత అప్తుడిగా భావించే మేఘా కృష్ణా రెడ్డిని షర్మిల టార్గెట్ చేశారని అంటున్నారు. అలాగే, సమయ సందర్భాలను బట్టి చూస్తే, బీజేపీ పెద్దలు కేసీఆర్’ను ఇరకాటంలోకి నెట్టేందుకు షర్మిలను రంగంలోకి  దించారని అంటున్నారు. అయితే గతంలో, కేఎ పాల్’కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రిని కలిసిన తర్వాతనే కాళేశ్వరం సహా తెరాస ప్రభుత్వ అవినీతికి సంబంధించి, సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు షర్మిల అమిత్ షా ను ప్రత్యక్ష్యంగా కలవక పోయినా, ఆయన, ఇతర బీజేపీ పెద్దల సూచనల మేరకే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టార్గెట్’గా ఇద్దరి అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్న మేఘా కృష్ణా రెడ్డిపై ఆరోపణలు చేశారని అంటున్నారు. అందుకే ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం? షర్మిల టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకక ముందే ఈమె మరో సారి ఈ నెల 21న అంటే శుక్రవారం మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సారి ఆమె సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదునే ఈడీకి కూడా అందజేస్తారని చెబుతున్నారు. 

By
en-us Political News

  
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.