పొంగులేటికి రియల్ బాస్ ఎవరంటే?

Publish Date:Jul 7, 2023

Advertisement

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు  నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా తయారయ్యాయి. అలాంటి ఊహించని వాటిలో ఒకటే ఈ మధ్యనే అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం సీనియర్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి సీఎంతో భేటీ అయ్యారు. నిన్న కాక మొన్న కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి.. కాంగ్రెస్ ను విభేదించి వేరు కుంపటి పెట్టుకున్న ఏపీ సీఎంతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు జగన్ సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని.. ఇప్పటికే చర్చలు సంప్రదింపు కూడా అయిపోయాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి   జగన్ తో భేటీ కావడం సహజంగానే ఆసక్తి కలిగిస్తున్నది.

అసలు పొంగులేటి విషయానికి వస్తే తొలుత జగన్ వైసీపీ. వైసీపీ ఆంధ్రాకి పరిమితం అయ్యాక టీఆర్ఎస్. ఆ తరువాత  కేసీఆర్ తో విభేదాల కారణంగా పార్టీ  నుంచి బహిష్కృతుడైన అనంతరం సుదీర్ఘ కాలం పాటు బీజేపీయా, కాంగ్రెస్సా అన్న ఊగిసలాటలో ఉన్న పొంగులేటి  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే తొలి నుండి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు  ఉన్న పొంగులేటి రాష్ట్ర విభజన అనంతరం కూడా వైసీపీ నుండే  ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అయితే, ఆ తర్వాత పరిస్థితులలో వైసీపీ ఆంధ్రాకి పరిమితం అయిపోవడంతో అప్పటికి జగన్ తో సఖ్యత, సత్సంబంధాలు  ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్) లో చేరిపోయారు. అక్కడ ఇమడలేక ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వైఎస్ కుటుంబంతో సంబంధాలతోనే ఈ మధ్య పొంగులేటి షర్మిల, విజయమ్మలతో కూడా చర్చించారు. ఇప్పుడు అదే వరసలో సీఎం జగన్ తో కూడా భేటీ అయ్యారు.

అయితే, జగన్ తో పొంగులేటి భేటీ కావడంతో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు కూడా పొంగులేటి జగన్ ను కలిశారు. కానీ తాజా భేటీ మాత్రం రాజకీయాలలో పెను చర్చకు దారితీసింది. వీరిద్దరి చర్చల్లో కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు సిద్ధమైన జగన్ సోదరి షర్మిల టాపిక్కే కీలకమని తెలుస్తోంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. కేవీపీ లాంటి ఆ కుటుంబంతో దగ్గరగా ఉండే నేతలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ క్రమంలోనే సోదరి షర్మిల విషయంపైనే జగన్ ను పొంగులేటి కలిసినట్లుగా ఓ వర్గంలో రాజకీయ చర్చలు సాగుతున్నాయి.

కాగా, షర్మిల ఇప్పటికిప్పుడు తెలంగాణను వదిలి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం ఉంది. షర్మిల కూడా సోషల్ మీడియా లో ఇదే విషయాన్ని పంచుకున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిలను ఏపీకి పంపితేనే ప్రయోజనం ఉంటుందని అధిష్టానానికి చెబుతున్నారు. ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల రాకతో తమకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుందనే లెక్కల్లో ఉన్నారు.

ఈ క్రమంలోనే షర్మిల తరపునే పొంగులేటి జగన్ వద్దకు వెళ్లారనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు పొంగులేటికి అసలు బాస్ జగన్ మోహన్ రెడ్డేనని.. ప్రస్తుతం తెలంగాణలో వైసీపీ లేనందున పొంగులేటి కాంగ్రెస్ లో చేరారని, వ్యాపార లావాదేవీలతో పాటు రాజకీయంగా కూడా పొంగులేటిని నడిపించేది జగన్ మోహన్ రెడ్డేనని మరోవైపు చర్చలు సాగుతున్నాయి. ఇందులో ఏది నిజం అనేది ఎలా ఉన్నా.. ఈ భేటీ మాత్రం కాస్త తెలుగు రాజకీయాలలో కొత్త చర్చకు దారితీసింది.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.