ఎర్రచందనం స్మగ్లర్లకు అండ ఎవరు విజయసాయీ?

Publish Date:Aug 28, 2023

Advertisement

స్పందన జీవ లక్షణం, ప్రతి స్పందన మనిషి లక్షణం.. ఈ లక్షణాలు నూటికి నూరు శాతం ఉన్న వ్యక్తి అధికార జగన్ పార్టీలో ఎవరైనా ఉన్నారా? అంటే.. ఆ పార్టీ తొలి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక్కరే ఉన్నారని వైసీపీలోని ఆయన వ్యతిరేక వర్గం పెద్ద గొంతేసుకుని చెబుతారు. దేశంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. దానిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లకు ఆపాదిస్తూ.. ట్విట్టర్ వేదికగా స్పందించడం ఆయన విజయసాయిరెడ్డికి ఉన్న ప్రత్యేక లక్షణం అంటారు.

అలా పోలికలు ఆపాదిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు ఒక్కొక్కసారి బూమరాంగ్ అవుతుంటాయనీ, వాటి వల్ల పార్టీకి పూడ్చలేని నష్టం వాటిల్లుతున్నదని కూడా చెబుతారు. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ వైసీపీకి గట్టిగానే తగిలింది. ఇటీవల పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. దీంతో  అల్లు అర్జున్ ను అభినందిస్తూ పలువురు ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా అభినందించారు. వెంటనే విజయసాయి ట్విట్టర్ వేదికగా తన వ్యంగ్య వైభవానికి నగిషీలు అద్దుతూ రంగంలోకి వచ్చేశారు.  అల్లు అర్జున్ అభినందించడంతో ఊరుకోకుండా పనిలో పనిగా చంద్రబాబుపై సెటైర్లు వేయడానికి ప్రయత్నించి భంగపడ్డారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి వైసీపీని నవ్వుల పాలు చేసింది. ఇంతకీ ఆయన ఆ ట్వీట్ లో ఏమన్నారంటే.. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దానిని తనకే ఆపాదించుకుంటారు చంద్రబాబు గారు. పుష్ప హీరో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్పూర్తి అని అన్నా అంటారు.  తన హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది. ఎందరో పుష్పరాజ్‌లను నేనే తయారు చేశా. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ అని బాబు బాంబు పేలుస్తాడేమో అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతే వైసీపీలోని ఆయన వ్యతిరేకులే కాకుండా, తెలుగుదేశం శ్రేణులు కూడా విజయసాయి ట్వీట్ పై తమదైన స్టైల్ లో రివర్స్ సెటైర్లు గుప్పించేశారు.  ఆ ట్వీట్ల సారాంశమేంటంటే..  విజయసాయిరెడ్డిగారు చెప్పేది నిజమే.. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రత్యేక  టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశారని.. ఆ టాస్క్‌ఫోర్స్‌కు అధిపతిగా నీతి నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారిని నియమించారని.. ఆ క్రమంలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న తమిళ కూలీలపై కాల్పులు జరిపితే.. 20 మంది  మరణించారు. ఆ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విజయసాయిరెడ్డి మరిచిపోయి ఉంటారు.  అదీకాక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ.... అటు ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లోనే కాకుండా..  ఇటు శేషాచలం అడవుల్లో పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు పట్టుబడ్డారు.  అదే విధంగా రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనాన్ని తరలిస్తూ కూలీలను రెడ్ హ్యాండెడ్‌గా టాస్క్ ఫోర్స్ పోలీసులు  పట్టుకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. కానీ  జగన్ ప్రభుత్వం గద్దెనెక్కన తర్వాత.. ఎర్రచందనం స్మగ్లింగ్ అనే మాటే వినపడం లేదని.. దీంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోయిందా? లేకుంటే స్మగ్లింగ్ జరుగుతోందా? జరుగుతుంటే సైలెంట్‌గా జరుగుతోందా?  ఓ వేళ స్మగ్లింగ్ ఆగిపోతే ? ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమైనా పట్టిష్టమైన ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందా? అదీకాక జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లో శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం కానీ.. వాటిని ఎత్తుకెళ్తున్న కూలీలు కానీ పట్టుబడ్డారంటూ ఏక్కడా ఒక్క వార్త కూడా అటు మీడియాలో కానీ.. ఇటు సోషల్ మీడియాలో కానీ రాలేదు, దీంతో శేషాచలం అడవులు, ఎర్రచందనం, ఎర్రచందనం స్మగ్లింగ్ అనే పదాలు తెలుగు ప్రజలు దాదాపుగా మరిచిపోయారని.. కానీ పుష్ప సినిమా విడుదల సందర్భంగా... ఎర్రచందనం స్మగ్లింగ్ విషయం ప్రజలకు గుర్తుకు వచ్చింది.

ఆ తర్వాత ఆ విషయం కూడా ప్రజలు మరిచిపోతున్న తరుణంలో.. పుష్ప సినిమా హీరో పుష్ప అలియాస్ ఫుష్పరాజ్‌గా నటించిన అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం.. ఈ నేపథ్యంలో విజయాసాయిరెడ్డి.. ఇలా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుపై వ్యంగ్యంగా స్పందించడంతో.. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శేషాచలం అడవుల్లో చోటు చేసుకొన్న సంఘటనలు కళ్ల ముందు కదలాడాయని విజయసాయిరెడ్డి వ్యతిరేకులు ట్వీట్టర్ వేదికగా గుర్తు చేస్తున్నారు. 

అదీకాక తిరుమల కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది.. అందుకు ఆటు శేషాచలం  అడవుల్లో ఉండాల్సిన వైపు వెళ్లాల్సిన కృూర మృగాలు..  అలిపిరి మెట్ల మార్గం వైపునకు దూసుకు వచ్చి శ్రీవారి భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.  

అయినా తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ.. అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన కొల్లం గంగిరెడ్డి బెయిల్‌పై విడుదల చేయించింది నాటి సీఎం చంద్రబాబు హయాంలోనేనా?.... లేకుంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన వెంటనేనా? అనేది మాత్రం తమకు గుర్తుకు రావడం లేదని ఈ సందర్భంగా విజయసాయి వ్యతిరేకులు సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. 

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.