వరద ముంపునకు శాశ్వత పరిష్కారమేది?

Publish Date:Jul 19, 2022

Advertisement

గోదావరి నదిలో ఉవ్వెత్తున వరదనీరు పోటెత్తి ప్రహిస్తోంది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు వరద ముంపుతో అల్లాడిపోతున్నారు. వరద విలయంతో వందలాది లంక గ్రామాల వాసులు గజగజలాడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక, తలదాచుకోవడానికి చోటు లేక తల్లడిల్లిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయల పంటలు నీటమునిగాయి. వేలాది పశువులు, పెంపుడు పక్షులు, సామాగ్రి వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి.

తెలంగాణలోని పవిత్ర పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వెళ్లేందుకు నిర్మించిన శబరినదిపై వంతెన పైనుంచి కూడా వరదనీరు ప్రవహిస్తోంది. భద్రాచలం క్షేత్రంలో వరదనీరు ముంచెత్తేసింది. భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం అత్యంత ప్రమాదకర స్థాయిలో 71 అడుగులకు చేరుకుంది. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద గోదావరి ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దిగువన తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద పోటెత్తి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరదనీరు సుమారు 21 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 బ్యారేజీ గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి  23 లక్షల 94 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వందేళ్ల చరిత్రలో 41 పర్యాయాలు గోదావరి నదిలో భారీ వరదలు ముంచెత్తాయి. వరద పోటెత్తినప్పుడల్లా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అన్నింటినీ పోగొట్టుకుని అతలాకుతలం అయిపోతూనే ఉన్నారు. 1853 నుంచీ చూసుకుంటే.. ధవళేశ్వరం వద్ద రికార్డు స్థాయిలో అత్యధికంగా 1986 ఆగస్టు 16న 35.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించినట్లు రికార్డయింది. అంతకు ముందు 1953 ఆగస్టు 19న రెండో అత్యధిక వరదగా నమోదై 30 లక్షల క్యూసెక్కులు ప్రవహించింది. 2006 ఆగస్టు 7వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 28.5 లక్షల క్యూసెక్కుల వరద రికార్డయింది. 1990 ఆగస్టు 25న 27.8 లక్షల క్యూసెక్కుల వరదనీరు, 2010 ఆగస్టు 9న 20.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు నమోదైంది. ఇక తాజాగా గోదావరికి వచ్చిన వరద 21 నుంచి 22 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. అంటే.. గోదావరి నది చరిత్రలో 41 సార్లు వచ్చిన వరదల్లో ఈసారా నాలుగో లేదా ఐదో అతిపెద్ద వరదగా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

అయితే.. పదుల సార్లు గోదావరి వరదలు పోటెత్తి గ్రామాలకు గ్రామాలనే ముంచేసి, లక్షల కోట్ల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నా.. వేలు, లక్షల మూగజీవాలు మృత్యువాత పడుతున్నా ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఏమి చేశాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంటికి చుట్టం వచ్చిన తర్వాత పొయ్యి వెలిగించినట్టు ఏవో తాత్కాలిక చర్యలే తప్ప వరదలతో జననష్టం, ఆస్తి నష్టం జరగనివిధంగా ప్రభుత్వాలు శాశ్వతంగా చేసిన ప్రయత్నాలేవీ లేవనేది బాధితులందరి నోటా వినిపిస్తున్న విమర్శ. వరదలు ముంచెత్తుకు వచ్చిన తర్వాత నది కరకట్టలపై కొన్ని ఇసుకబస్తాలు వేయడమే తప్ప ఏటి గట్లను పటిష్టంగా ఏర్పాటు చేసే దిశగా ఏ ఒక్క ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదనేది వాస్తవం అంటున్నారు.

వరదనీరు ఊళ్లను ముంచెత్తిన తర్వాత బాధిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి అరకొరగా భోజన, వసతి సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. వరదపోటు ఎక్కువైనప్పుడు ఆర్మీని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నాయి తప్ప బాధితుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా ఉపేక్షిస్తున్నాయంటున్నారు. ఇప్పటికైనా వరద కష్టాల నుంచి తమను శాశ్వతంగా బయటపడేసేందుకు సరైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను బాధితులు వేడుకుంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.