చంద్రబాబు, పవన్.. తెలంగాణలో ప్రభావం ఎలా ఉంటుందంటే..?

Publish Date:Jan 10, 2023

Advertisement

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన సంగతి విదితమే.   వచ్చే ఎన్నికలలో ఏపీలో రాజకీయ సమీకరణాలేమిటన్నది ఈ భేటీ తేల్చేసిందనే పరిశీలకులు చెబుతున్నారు. వీరి భేటీపై అధికార వైసీపీ నేతల విమర్శలే.. రాజకీయ యవనికపై వీరి కలయిక ఎంతటి ప్రభావం చూపిందన్నది ఇట్టే అవగతమౌతుంది.

జగన్  పాలనను ప్రజా  క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వ రాజ్యహింస, అణచివేత పతాక స్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదలాలని నిర్ణయానికి వచ్చాయా? ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? అంటూ వీరి భేటీ అనంతరం రాజకీయ వర్గాలలో చర్చ ప్రారంభమైంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. సరే ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే.. వీరి భేటీ ప్రభావం తెలంగాణలో ఎలా ఉంది.  ఉంటుంది అన్న విషయానికి వస్తే.. 

ఒక వేళ తెలుగుదేశం, జనసేనలు ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగితే పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అందుకే..  తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకులే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. అంటూ ఇంత కాలంగా వినవస్తున్న వ్యాఖ్యలన్నీ పూర్వపక్షమై పోయేలా ఇటీవలి చంద్రబాబు ఖమ్మం సభ సక్సెస్  అయ్యింది. తెలంగాణలో లీడర్ లేకపోయినా.. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్న విషయాన్ని తెలుగుదేశం సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది.  ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా తెలంగాణలో ఇప్పటికీ  తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ గట్టి పట్టు ఉంది. ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయనకు ఏపీలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఉంది.

దీంతో చంద్రబాబు, పవన్ కల్యాన్ భేటీ తెలంగాణలో కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.  జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ రణ క్షేత్రంలో  అడుగు పెడితే ఇక్కడ అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, జనసేనానికి ఉన్న ఆదరణ కలిసి రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావమే చూపే అవకాశం ఉంది.  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 14.7 శాతం ఓట్లతో 15 స్దానాలలో విజయం సాధించింది. అలాగే 2018 ఎన్నికలలో రెండు స్థానాలలో విజయం సాధించింది. ఇప్పటికీ   కనీసం పాతిక స్థానాలలో తెలుగుదేశం ప్రభావం గణనీయంగా ఉంటుందని పరిశీలకలు  విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయిన తరువాత తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైపోయిందనీ, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం మరింత ప్రభావమంతమైన పాత్ర పోషిస్తుందంటున్నారు.

తెలుగుదేశం, జనసేనలు కలిస్తే ఆ ప్రభావం మరింతగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కలయిక వెనుక ఆర్ఎస్ఎస్ ఉండటంతో తెలంగాణలో  వీరి కలయికతో  అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అందులోనూ బీజేపీ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ తెలుగుదేశం, జనసేనల కలయిక వెనుక ఉందంటే కచ్చితంగా ఈ రెండు పార్టీల కు బీజేపీ మద్దతు కూడా తోడౌతుందనీ అంటున్నారు. ఉభయ తారకంగా తెలుగుదేశం జనసేనల పొత్తుకు ఏపీలో బీజేపీ సహకారం, అందుకు ప్రతిగా ఈ కూటమి తెలంగాణలో కమలం పార్టీకి  అండ  అన్న వ్యూహం అమలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.