Publish Date:May 29, 2023
ఎంఐఎం అనగానే తెలంగాణలో పాతబస్తీకే పరిమితమైన జాతీయ పార్టీగా గుర్తింపు ఉంది. అయితే ఆ పార్టీ హైదరాబాద్ మహానగరంలో పాతబస్తీకే పరిమితం కావడం వెనుక ఆ పార్టీ అక్కడే బలంగా ఉండటం కారణమని అంతా భావిస్తు వస్తున్నారు. అయితే ఎంఐం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం వచ్చే ఎన్నికలలో తమ పోటీ పాతబస్తీ వెలుపల కూడా ఉంటుందని చెబుతున్నారు.
తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా తామీ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఇంత కాలం అనధికార మిత్ర పక్షమైన బీఆర్ఎస్ కోసం తాము ఓల్డ్ సిటీకే పరిమితమయ్యామనీ, అయితే అందువల్ల బీజేపీ బలపడుతోందనీ, అందుకే అవసరమైతే బీఆర్ఎస్ ను పక్కన పెట్టి మరీ ఓల్డ్ సిటీ బయట పోటీ చేయడానికి రెడీ అవుతున్నామని అసదుద్దీన్ చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో తాము నిజామాబాద్, కరీంనగర్, సికిందరాబాద్ ల నుంచి పోటీలో లేకపోవడం వల్ల బీజేపీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. ఎంఐఎం తమ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీ విజయానికి దోహదపడుతోందని ఆరోపణలు చేస్తున్న సెక్యులర్ పార్టీలు ఈ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు.
తెలంగాణ కొత్త సచివాలయంపై బీజేపీ జెండా ఎగరడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఒవైసీ స్పష్టం చేశారు. ఎంఐఎం బలంగా ఉంటేనే తెలంగాణలో మతసామరస్యం వెల్లివిరుస్తుందని చరిత్ర చెబుతున్న సత్యమని ఒవైసీ అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ స్థానాల సంఖ్యపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అయితే పరిశీలకులు మాత్రం ఓల్డ్ సిటీ బయట ఎంఐఎం పోటీ చేయడం వల్ల అంతిమంగా బీజేపీయే లబ్ధి పొందుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇంత కాలం ఓల్డ్ సిటీకి పరిమితమై పోటీలో ఉన్న ఎంఐఎం కే బీజేపీ యేతర పార్టీలు, ఇప్పుడైతే బీఆర్ఎస్.. అంతకు ముందు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోటీ ద్వారా బయటి ఓట్లు చీలి బీజేపీ లబ్ధి పొందకుండా పరస్పర సహకారం అందించుకునేవనీ, ఇప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీ దాటి బయటకు వస్తే.. సెక్యులర్ ఓట్లు చీలి బీజేపీకే ఎక్కువ ప్రయోజం చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలోపేతమౌతోందన్న భావన వ్యక్తమౌతున్న వేళ ఎంఐఎం నిర్ణయం బీజేపీకి నెత్తిన పాలు పోసినట్లేనని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-mim-strategy-39-156013.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.