నివురు గప్పిన నిప్పులా పుంగనూరు.. అసలేం జరుగుతోంది?

Publish Date:Aug 10, 2023

Advertisement

ఉన్నట్లుండి ఇక్కడ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మాయమవుతున్నారు. రాత్రికి రాత్రి టీడీపీ నేతల జాడ కనిపించకుండా పోతున్నది. వారి కుటుంబ సభ్యులేమో పోలీసులమంటూ వచ్చిన వారు  మా వాళ్ళని తీసుకెళ్లారని చెప్తున్నారు. పోలీసులేమో వారిని అదుపులోకి తీసుకున్నట్లు, అరెస్ట్ చేసినట్లు ఎక్కడా పేర్కొనడం లేదు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానిక వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా తెలుగుదేశం నేతలు, వారి అనుచరులు, కార్యకర్తలు కనిపించకుండా పోతున్నారు.  దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయనను అడ్డుకొనేందుకు వైసీపీ వర్గం ప్రయత్నించడంతో తెలుగుదేశం శ్రేణులుతిరగబడ్డాయి. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటికే  తెలుగు అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులతో పాటు ఏడుగురిపై కేసులు నమోదు చేయగా.. స్థానిక తెలుగుదేశం  నేతలు, కార్యకర్తలు మొత్తం 74 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, పుంగనూరులో దాదాపు 150 మందికి పైగా  తెలుగుదేశం సానుభూతిపరుల ఆచూకీ కనిపించడం లేదట. ఇందులో మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి, పలమనేరు ఇంచార్జ్ చ‌ల్లా బాబు లాంటి బడా నేతలు కూడా ఉన్నారు. వీరంతా  అరెస్టుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండగా.. వీరి కుటుంబ సభ్యులు మాత్రం తమ వాళ్ళని పోలీసులే తీసుకెళ్లి రహస్య ప్రాంతంలో ఉంచి చిత్రహింసలు పెడుతూ విచారిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పలమనేరు ఇన్ చార్జ్ చల్లా బాబులపై  ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని.. అప్పటి వరకూ వారిని రహస్య ప్రాంతాలలోనే ఉంచనున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

నిజానికి పుంగనూరు అల్లర్ల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. దీంతో ఆ రాత్రికే ఇక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. కానీ మరుసటి రోజు నుండి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తుండడంతో మళ్ళీ ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సుమారు 200 మంది పోలీసులు ఇంటింటినీ జల్లెడ పడుతూ తెలుగుదేశం  సానుభూతి పరులను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఘర్షణ సమయంలో పోలీసులు గాయపడడం, పోలీసు వాహనాలు ధ్వంసం కావడంతో పోలీసులు కక్షకట్టి తెలుగుదేశం  కార్యకర్తలను ఈడ్చుకెళ్తున్నారని ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే అరెస్ట్ చేసిన 74 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయగా.. మరో వంద మందికి పైగా కార్యకర్తలు, నేతలను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు అక్రమ అరెస్టులు, మరోవైపు వందల మంది పోలీసులు ఇళ్లపై సోదాలు చేస్తుండడంతో పుంగనూరు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. తమ వారిని పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో.. ఏం చేస్తున్నారో కూడా అర్ధంకాని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలు ఆవేదన చేస్తుండగా.. అసలు తమ వాళ్ళని ఎక్కడకి తీసుకెళ్లారో చెప్పాలని తెలుగుదేశం నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల వైఖరి ఇలాగే కొనసాగితే మరోమారు ఇక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవాలని వైసీపీ సానుభూతి పరులు ప్రయత్నించినా, చంద్రబాబుపై రాళ్ల దాడికి దిగినా వైసీపీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమపై పోలీసులు జులుం చూపడాన్ని పుంగనూరు తెలుగుదేశం  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ క్రమంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం లేదని, పోలీసుల చర్యలతోనే మరోమారు ఇక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.