ఈటలతో అమిత్ షా భేటీ అందుకేనా?

Publish Date:Jun 20, 2022

Advertisement

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో సందేహం లేదు. బీజేపీ, ముఖ్యమంత్రి కేసీఆర్’తో లోపాయికారి ఒప్పందం  కుదుర్చుకుని, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేప్రయత్నం చేస్తోందని, కొంత ప్రచారం జరిగినా, మెల్ల మెల్లగా సీన్ మారి పోయింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని   నిర్ణయించడంతో, బెంగాల్  తరహాలోనే  బీజేపీ  తెలంగాణ పై దృష్టిని కేంద్రీకరించిందనే విషయం స్పష్టమైంది. మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే, గుజరాత్ వంటి రాష్ట్రాల కంటే, ఎన్నికలకు సంవత్సరం పైగా సమయమున్న తెలంగాణ పై, బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర కీలక నేతలు  రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మరో వంక తెర వెనక నుంచి చక్రం తిప్పే సంఘ్ పరివార్ నేతలు రాష్ట్రంలో తిష్టవేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సంఘ్ పెద్దలకు, పార్టీఅధిష్టానానికి అందచేస్తున్నారని, తదనుగుణంగా కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, పార్టీ వర్గాల సమాచారం.  ఇందులో భాగంగానే, ఇప్పుడు, మరో పది రోజుల్లో, హైదరాబాద్’లో పార్టీ జాతీయ కార్యవర్గ  సమావేశాలు జరుగతున్న సమయంలో, మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు  కేంద్ర హోం మంత్రి  అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. ఆ  పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి  అమిత్ షాను కలిసారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఇటు   రాజకీయవర్గాల్లో అటు పార్టీ వర్గాలో చర్చనీయాంశమైంది.  ఈటలను హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు పిలిచారు? ఆయనకు కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈటలకు ప్రత్యేక పీఠం వేసేందుకే, అమిత్ షా ఆయన్ని ఢిల్లీ పిలిపించి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించిన నేపధ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు, ఈటలకు జాతీయ స్థాయిలో పదవి ఇస్తారా? లేక రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా, అనే విషయంలో విభిన్న అభిప్రాయలు వ్యక్త మవుతున్నాయి. గత కొంత కాలంగా ఓ వంక  ఈటల కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది,  మరో వంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మరుస్తారనే ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే, బండి సంజయ పాద యత్ర ముగుంపు సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా, స్వయంగా బహిరంగ వేదిక నుంచి బండి సంజయ్ ని ప్రశంసలతో ముంచెత్తి, ‘మార్పు’  ప్రచారానికి తెర దించారు.  ఏ  నేపధ్యంలో ఈటలకు ఏ పదవి ఇస్తారు? ఏ బాధ్యతలు అప్పగిస్తారు అనే విషయంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవికి సమన హోదా కల్పిస్తూ పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా? లేక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంటి పదవి కట్టబెట్టబోతున్నారా? అన్నది చర్చనీయాంశమైంది.

అయితే పదవి ఏదైనా, బీజేపీలో బయట నుంచి వచ్చిన వారికి సముచిత స్థానం లభించదు అన్న అపవాదును తొలిగించే విధంగా ఈటల సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుందని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు, తెలుగు వన్  కు చెప్పారు. తెరాస సహా ఇతర పార్టీలలోని కీలక నేతలు కొందరు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నా, ఒకసారి చేరిన తర్వాత, పార్టీలో తమ స్థానం ఏమిటి? అనే ప్రశ్న దగర ఆగిపోతున్నారు, అందుకే, పార్టీ అధినాయకత్వం ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించాలానే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. 

ఇందుకోసంగానే. డాక్టర్ కే.లక్ష్మణ సహా పార్టీ పాత కాపులకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈటలకు రాష్ట్ర స్థాయిలోనే కీలక బాధ్యతలు అప్పగించవచ్చన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.అయితే, బీజేపీ నాయకత్వం చివరకు ఎలాంటి  నిర్ణయం తీసుకుంటుంది, అనే దాని పైనే, ఈటల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.