30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కలిగే లాభనష్టాలు ఇవే..!

Publish Date:Nov 24, 2025

Advertisement


వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, బాధ్యతలు, అవగాహనతో కూడిన సంబంధం. ఈ రోజుల్లో చాలా మంది కెరీర్, చదువులు లేదా వ్యక్తిగతంగా ఎదగాలి అనే  కారణంగా ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. బాగా గమనిస్తే చాలా వరకు వివాహాలు 30 ఏళ్లు దాటిన వాళ్లవే ఎక్కువగా ఉంటున్నాయి.  30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే ధోరణి ఈ మధ్య కాలంలో బాగా  పెరిగింది. అయితే ప్రతి పనికి లాభ నష్టాలు ఉన్నట్టే.. 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోవడం అనే విషయంలో కూడా లాభనష్టాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే.. 30 ఏళ్ల లోపు వివాహం చేసుకోవడం మంచిదా? లేక 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే మంచిదా? అనే విషయం మీద ఒక క్లారిటీ వస్తుంది.  దీని గురించి తెలుసుకుంటే..

30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

30 సంవత్సరాల వయస్సులో చాలా మంది  కెరీర్‌లో సెటిల్ అయి ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం లేదా పొదుపు ఇలా చాలా కారణాలుగా  వివాహం తర్వాత ఆర్థిక అభద్రత తక్కువగా ఉంటుంది. భాగస్వామి పోషణ కూడా కష్టంగా అనిపించదు.  24-25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడంతో పోలిస్తే.. 30 ఏళ్ల తర్వాత చేసుకునే వివాహంలో ఆర్థిక భద్రత ఉంటుంది.

మానసిక పరిపక్వత, అవగాహన..

చిన్న వయస్సులో తీసుకునే నిర్ణయాలు తరచుగా తొందరపాటుతో ఉంటాయి. కానీ 30 సంవత్సరాల తర్వాత చాలా వరకు పరిణతి చెందుతారు.  సంబంధాల గురించి మంచి అవగాహన ఉంటుంది. ఈ పరిపక్వత వివాహాన్ని బలంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

వ్యక్తిగత వృద్ధి,  ఇండిపెండెన్స్..

30 ఏళ్లలోపు వారు చదువులు, కెరీర్, ప్రయాణాలు,  అభిరుచులు మొదలైన వాటిలో బిజీగా ఉంటారు. కానీ 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే వారు వైవాహిక బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది.

ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం..

30ఏళ్ళ తర్వాత చాలా వరకు పరిణితి పొంది ఉంటారు.  వీరు  తమ ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకుంటారు. జీవితంలో  ఏమి కోరుకుంటున్నారో,  వారి కుటుంబం,  వృత్తిని ఎలా బ్యాలెన్స్  చేసుకోవాలో వారికి తెలుసి ఉంటుంది.

డబ్బును సరిగ్గా ఉపయోగించడం..

30 సంవత్సరాల తర్వాత చాలామందికి  డబ్బు గురించి మంచి అవగాహన వచ్చి ఉంటుంది.  దీని వల్ల డబ్బును ప్లానింగ్ గా ఖర్చు పెట్టడం తెలిసి ఉంటుంది.

30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలు..


గర్భధారణలో సమస్యలు

మహిళలకు 30 తర్వాత సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 35 తర్వాత గర్భధారణలో ఇబ్బందులు,  సమస్యలు వచ్చే అవకాశాలు పెరగవచ్చు. వయస్సుతో పాటు అండాల నాణ్యత తగ్గుతుంది. ఇది గర్భధారణలో సమస్యలను కలిగిస్తుంది. పురుషులకు వయస్సుతో పాటు స్పెర్మ్ నాణ్యత కూడా ప్రభావితమవుతుంది. ఇది గర్భధారణను ఆలస్యం చేస్తుంది. పెరుగుతున్న వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ఇది ఆరోగ్యకరమైన వివాహ జీవితాన్ని గడపడం కష్టతరం చేస్తుంది.

సామాజిక ఒత్తిడి, అంచనాలు..

30 సంవత్సరాల తరువాత వివాహం విషయంలో కుటుంబం,  సమాజం నుండి  ఒత్తిడి ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కొన్ని సార్లు ఒత్తిడి కారణంగా తొందరపాటులో పెళ్లికి ఒప్పుకోవడం, ఆ తరువాత నష్టాన్ని చూడటం జరుగుతుంది.


సంబంధాలలో సర్దుబాటు కష్టం..

30 సంవత్సరాల తరువాత  వ్యక్తి యొక్క ఆలోచనలు, అలవాట్లు,  జీవనశైలి చాలా స్థిరంగా మారతాయి. దీని కారణంగా కొత్త వ్యక్తితో సర్దుబాటు చేసుకోవడం కష్టం కావచ్చు. అలవాట్లు మార్చుకోవడానికి వీరు అంత తొందరగా అంగీకరించరు. దీని వల్ల విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.

 పిల్లలను పెంచడం..

30 ఏళ్ళ  తర్వాత పిల్లలు ఆలస్యంగా జన్మిస్తే పిల్లలు పెరిగే సమయానికి తల్లిదండ్రులు పెద్దవారవుతారు. ఇది పిల్లలను పెంచడంలో, వారి  భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడంలో సవాళ్లకు దారితీయవచ్చు. తల్లిదండ్రులు,  పిల్లల మధ్య పెద్ద తరం అంతరం పరస్పర అవగాహన,  బంధంలో ఇబ్బందులకు దారితీస్తుంది.

ఆర్థిక ఒత్తిడి,  భవిష్యత్తు ప్రణాళిక..

30 సంవత్సరాల తర్వాత ఉద్యోగ భాద్యతలు,   ఆర్థిక బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఇది వివాహం తర్వాత కొత్త బాధ్యతలను నెరవేర్చడం సవాలుగా చేస్తుంది. వివాహం తర్వాత జీవితంలో ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. పెద్ద వయస్సులో వివాహం చేసుకున్న తర్వాత, దంపతులు ఒకరితో ఒకరు సమయం గడపడం కంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది.

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.