బీజేపీ పాలిత రాష్ట్రాలలో అగ్నిపథ్ మంటలపై మౌనమేల కిషన్ రెడ్డీజీ!

Publish Date:Jun 17, 2022

Advertisement

అగ్నిపథ్ మంటలు దేశమంతటా వ్యాపించాయి. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం అగ్నిపథ్ అంటూ ప్రకటన వెలువడిన క్షణం నుంచీ దేశంలో యువత రగిలిపోతున్నారు. వారి ఆందోళనలు హింసాత్మక రూపం దాలుస్తున్నాయి. వారి ఆవేదనను అర్ధం చేసుకుని, వారిని సముదాయించడానికి చర్యలకు ఉపక్రమించాల్సిన కేంద్రం మరింత  రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నది. అదలా ఉంచితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికిందరాబాద్ అల్లర్లపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అత్యంత బాధ్యతా రహితంగా ఉన్నాయి.

సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని అంటూనే కిషన్ రెడ్డి..ఈ అల్లర్లు అత్యంత పకడ్బందీగా ఒక పథకం ప్రకారం జరిగాయనీ, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేననీ అన్నారు. ఒక సీరియస్ సమస్యను రాజకీయ విమర్శలకు, ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవడమే దురదృష్టకరం. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కిషన్ రెడ్డి ఇటువంటి ప్రకటనలు, విమర్శలు చేయడం శోచనీయం అని పరిశీలకులు అంటున్నారు. సికిందరాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనలు ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు. వాటిని నివారించడంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాన్ని కూడా సమర్థించలేం. కానీ ఈ ఆందోళనలు ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ జరిగాయి. అక్కడా ఆందోళనలు హింసాత్మక రూపం జరిగాయి.  సికిందరాబాద్ రైల్వే స్టేషన్ హింసాత్మక ఘటనలు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం అయితే.. యూపీలో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యమేనా? కిషన్ రెడ్డి ఆ విమర్శ చేస్తారా? చేయగలరా? తెలంగాణలో ఉన్నది బీజేపీయేతర ప్రభుత్వం కనుకే ఇక్కడ అల్లర్లు జరిగాయని సూత్రీకరించడం సమంజసమేనా?     వాస్తవానికి ఆర్మీలో నియామకాలకు ‘అగ్నిపథ్’ అంటూ ప్రభుత్వం  ప్రకటన చేసిన క్షణం నుంచీ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలుచోట్ల రైళ్లను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.  

‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా బీహార్ లో పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి.   హర్యానాలోని ఫరీదాబాద్ బల్లబ్ గఢ్ ప్రాంతంలో ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగారు. దీంతో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపేశారు.  

తమిళనాడులోనూ ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఇలా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరిగినా కిషన్ రెడ్డి కేవలం తెలంగాణలో మాత్రమే శాంతి భద్రతల వైఫల్యం అంటూ విమర్శలు గుప్పించడం రాజకీయం తప్ప మరోటి కాదని పరిశీలకులు అంటున్నారు. అల్లర్లు జరిగిన రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉన్నాయని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

By
en-us Political News

  
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.